కేరళ నర్సులు మలయాళంలో మాట్లాడొద్దు.. ఢిల్లీ ఆస్పత్రి వివాదాస్పద ఆదేశాలు జారీ.. మండిపడుతున్న మలయాళీలు

by సూర్య | Sun, Jun 06, 2021, 10:09 AM

కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరులో కేరళ నర్సులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పోరాటంలో చాలామంది తమ ప్రాణాలు కూడా కోల్పోయారు. అంకిత భావంతో సేవలందించే కేరళ నర్సులకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశ వ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో వారు వేల సంఖ్యలో సేవలందిస్తున్నారు. అటు విదేశాలు కూడా కరోనాపై పోరాటంలో కేరళ నర్సుల సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మలయాళంలో మాట్లాడొద్దంటూ కేరళకు చెందిన నర్సులకు ఢిల్లీ ఆస్పత్రి వివాదాస్పద ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రిలో ఇంగ్లీష్ లేదా హిందీలోనే మాట్లాడుకోవాలని, లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటూ ఢిల్లీలోని గోవింద్ బల్లబ్ పంత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ "GIPMER" ఆదేశాలు జారీ చేసింది.


ఆస్పత్రిలో చికిత్స పొందే రోగులు, సహచర ఉద్యోగుల్లో ఎక్కువ మందికి మలయాళం అర్థంకాకపోవడంతో ఇబ్బంది ఏర్పడుతోందని ఆ సర్క్యులర్‌లో పేర్కొంది.దీనికి సంబందించి తమకు ఓ ఫిర్యాదు అందినట్లు జిప్‌మెర్ తెలిపింది. దీన్ని పరిగణలోకి తీసుకుని అందరూ ఇంగ్లీష్ లేదా హిందీలో మాట్లాడాలని#8230;లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Latest News

 
వాలంటీర్లు కలిసికట్టుగా పనిచేసి వైసిపి గెలుపుకు కృషి చేయాలి Tue, May 07, 2024, 12:50 PM
పోస్టల్ బ్యాలెట్ సెంటర్ ను తనిఖీ చేసిన ఆర్డిఓ Tue, May 07, 2024, 12:40 PM
వింజమూరులో పర్యటించిన మేకపాటి కుమారులు Tue, May 07, 2024, 12:08 PM
యధావిధిగా డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్ష Tue, May 07, 2024, 12:07 PM
శ్రీనివాసపురంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం Tue, May 07, 2024, 11:55 AM