మద్యం హోం డెలివరీకి గ్రీన్ సిగ్నల్ అరవింద్ కేజ్రివాల్

by సూర్య | Tue, Jun 01, 2021, 03:00 PM

ఢిల్లీలో కోవిడ్ ఆంక్షలున్నప్పటికీ స్వదేశీ, విదేశీ మద్యానికి కేజ్రివాల్ ప్రభుత్వం హోం డెలివరీకి అనుమతించినది . మొబైల్ యాప్స్ లేదా ఆన్ లైన్ వెబ్ పోర్టల్స్ ద్వారా ఇండియన్ లేక ఫారిన్ లిక్కర్ ని ఇంటివద్దకే తెప్పించుకోవచ్చునని ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీ ఎక్సయిజు చట్టాన్ని సవరించడంతో ఈ వెసులుబాటు కలిగింది. ఇటీవలి వరకు నగరంలో హోమ్ డెలివరీకి అనుమతించినప్పటికీ ఎల్-13 లైసెన్స్ ఉన్నవారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటూ వచ్చింది. ఫోన్ ద్వారా కాకుండా ఈ-మెయిల్ లేదా ఫ్యాక్స్ ద్వారా అందే ఆర్దర్లమేరకు అమ్మకందారులు లిక్కర్ ను కస్టమర్ల ఇళ్ల వద్దకు పంపేవారు. 


కానీ ఇక కొత్త రూల్స్ ప్రకారం మొబైల్ యాప్ లేదా వెబ్ పోర్టల్ ద్వారా హోమ్ డెలివరీకి అనుమతిస్తున్నామని అధికారులు తెలిపారు. కానీ నగర వ్యాప్తంగా మాత్రం ఆల్కహాల్ డెలివరీకి అమ్మకందారులను అనుమతించే ప్రసక్తి లేదన్నారు. ఎల్-14 లైసెన్స్ గల అమ్మకందారులే హోమ్ డెలివరీ అమ్మకాలకు అర్హులని వారు చెప్పారు. ఇక రూల్స్ సవరించినందున నగరంలో మద్యం షాపుల ముందు చాంతాడంత క్యూలు కనిపించక పోవచ్చు. ఇకలైసెన్సులు గలవారు టెరెస్ లు, బార్లు, క్లబ్బులు, రెస్టారెంట్లలో మద్యాన్ని సర్వ్ చేయవచ్చునని అధికారులు స్పష్టం చేశారు. గత మార్చిలో ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని ప్రకటించింది. డ్రింకింగ్ కి వ్యక్తుల లీగల్ ఏజ్ ని 25 ఏళ్ళ నుంచి 21 ఏళ్లకు తగ్గించినట్టు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గతంలోనే ప్రకటించారు. ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, కర్నాటక, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలు ఇదివరకే లిక్కర్ హోమ్ డెలివరీకి అనుమతించాయి.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM