దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కానీ ఆందోళనకరంగా మారిన కరోనా మరణాలు

by సూర్య | Tue, May 25, 2021, 10:21 AM

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. నిన్న మొన్నటి వరకు మూడు లక్షల వరకు నమోదైన పాజిటివ్‌ కేసులు తాజాగా రెండులక్షలకు దిగువన నమోదయ్యాయి. కరోనా మరణాలు మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయి. నిన్న 4వేలకుపైగా మరణాలు నమోదవగా.. కొత్తగా నాలుగువేలకు దిగువన రికార్డయ్యాయి. మరో వైపు పెద్ద సంఖ్యలో బాధితులు వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,96,427 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 3,511 మంది వైరస్‌ బారినపడి ప్రాణాలు వదిలారు. 24 గంటల్లో 3,26,850 బాధితులు డిశ్చార్జి అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,69,48,874కు పెరగ్గా.. 2,40,54,861 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు 3,07,231 మంది వైరస్‌ బారినపడి మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 25,86,782 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని పేర్కొంది. మరో వైపు టీకా డ్రైవ్‌లో భాగంగా 19,85,38,999 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. ఇదిలా ఉండగా నిన్న ఒకే రోజు 20,58,112 కరోనా నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ " ఐసీఎంఆర్‌ " తెలిపింది. ఇప్పటి వరకు 33,25,94,176 టెస్టులు చేసినట్లు వివరించింది.

Latest News

 
ఆధారాలు లేని రూ. 50 లక్షలు నగదు స్వాధీనం Mon, Apr 29, 2024, 12:42 PM
పేలిన విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ Mon, Apr 29, 2024, 12:40 PM
నేడు ధర్మవరంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రచారం Mon, Apr 29, 2024, 12:38 PM
జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు...? Mon, Apr 29, 2024, 12:37 PM
నేడు చోడ‌వ‌రంలో సీఎం బహిరంగ సభ Mon, Apr 29, 2024, 12:36 PM