నెయ్యి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

by సూర్య | Sat, Apr 10, 2021, 12:39 PM

అనేక మంది భోజన ప్రియులు నెయ్యి అంటే పడి చస్తారు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకోనిదే ముద్ద ముట్టని వారు కూడా అనేకం. అయితే నెయ్యి రుచి మరియు వాసనను పెంచడమే కాకుండా.. మరెన్నో ప్రయోజనాలను కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే భారతదేశంలో నెయ్యి తినే పద్ధతి యుగయుగాలుగా కొనసాగుతోంది. నెయ్యి వల్ల కలిగే ప్రయోజనాలు ఆయుర్వేదంలో కూడా ప్రస్తావించబడ్డాయి. క్రమంగా విదేశాలలో ఉన్నవారు కూడా నెయ్యి యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుని వినియోగిస్తున్నారు. అనేక ప్రయోజనాలు ఉన్న కారణంగా నెయ్యిని ద్రవ బంగారం అని కూడా పిలుస్తారు. మీ రోజువారీ ఆహారంలో కొద్దిగా నెయ్యి ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నెయ్యి మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. దేశీ నెయ్యిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి మరియు ఇది వైరస్లు, ఫ్లూ, దగ్గు, జలుబు మొదలైన వాటికి వ్యతిరేకంగా పోరాడుతుంది. నెయ్యిని తీసుకుంటే అది మన జీర్ణ శక్తిని పెంచుతుందని నిపుణులు తెలుపుతున్నారు. నెయ్యిలో ఉండే పదార్థాలు ఆలోచనా శక్తిని పెంచుతాయి. ఇది కణాలు మరియు కణజాలాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. ఖాళీ కడుపుతో ఉదయం నెయ్యి తినడం వల్ల కణాల పునరుత్పత్తి ప్రక్రియ మెరుగుపడుతుంది, ఇది మన శరీరం యొక్క వైద్యం ప్రక్రియను పెంచుతుంది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM