వికెట్లు తీయకపోతే లావైపోతా: భువీ

by సూర్య | Wed, Mar 31, 2021, 04:04 PM

ఐపీఎల్ అంటేనే ఫన్. క్షణక్షణం ఉత్కంఠ!. అంతకు మించి అభిమానులకు అంతులేని థ్రిల్. ఇవన్ని కలగలిపితేనే ఐపీఎల్ అంటూ మురిసిపోతారు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫ్యాన్స్. త్వరలో ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ కోసం అన్ని ఫ్రాంచైజీలు సిద్దం అవుతున్నాయి. హైదరాబాద్ హోం టీమ్ తమ అభిమానుల్లో జోష్ పెంచేందుకు రెడీగా ఉంది. హైదరాబాద్ ఫేసర్ భువనేశ్వర్ కుమార్ తో కూడిన ఓక పోస్టర్ ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


‘హైదరాబాదీ ఫ్యాన్స్‌ నాకు చాలా ప్రేమని ఇచ్చారు. పెర్ఫార్మెన్స్‌ రూపంలో తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే లావైపోతా' అంటూ మహేష్ బాబు శ్రీమంతుడు మూవీ డైలాగ్ తో కూడిన పోస్టర్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ట్వీట్ చేసింది. గాయాల కారణంగా గత సీజన్ మధ్యలో నుండి భువీ ఐపీఎల్ ను వదిలేశాడు. ఈ సారి మంచి ఫామ్ లో ఉన్న భువనేశ్వర్ జట్టులోకి రాబోతుండటంతో సన్ రైజర్స్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Latest News

 
శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన Thu, May 02, 2024, 05:03 PM
టీడీపీ అభ్యర్థికి మద్దతుగా హీరో నిఖిల్ ప్రచారం Thu, May 02, 2024, 05:01 PM
పుదుచ్చేరి మద్యం పట్టివేత Thu, May 02, 2024, 04:51 PM
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి రాంబాబు Thu, May 02, 2024, 04:38 PM
టీడీపీలో చేరిన పలు కుటుంబాలు Thu, May 02, 2024, 04:32 PM