మరోసారి నిషేధాన్ని పొడిగించిన చైనా

by సూర్య | Wed, Mar 24, 2021, 04:21 PM

ఉన్నత విద్యను అభ్యసించేందుకు చైనా వెళ్లిన భారతీయ విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. భారతీయ విద్యార్థులకు మరోసారి నిరాశే మిగిలింది. చైనా విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం చేస్తున్న భారతీయులపై ఉన్న ఆంక్షలను మరోసారి కొనసాగించింది. కరోనా నేపథ్యంలో స్వదేశంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు.. చైనాలోకి అడుగుపెట్టేందుకు ఆ దేశం నిరాకరించింది. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో ఆ దేశంలోకి భారతీయ విద్యార్థుల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని మరోసారి పొడగిస్తున్నట్టు పేర్కొంది. భారతీయ విద్యార్థులు మరికొంత కాలం ఆన్‌లైన్‌లోనే తరగతులకు హాజరు కావాలని సూచించింది. ముఖ్య సమాచారం కోసం యూనివర్సిటీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ సూచనలు పాటించాని సూచించింది.

Latest News

 
కలిశాలకు ప్రత్యేక పూజలు Thu, May 02, 2024, 01:59 PM
సీనియర్ వైసీపీ నాయకుడు శెట్టూరు అబ్దుల్లా టీడీపీలో చేరిక Thu, May 02, 2024, 01:57 PM
కదిరిలో రూ.లక్ష నగదు స్వాధీనం Thu, May 02, 2024, 01:55 PM
న్యాయం, ధర్మం వైపు ప్రజలు నిలబడాలి: షర్మిల Thu, May 02, 2024, 01:54 PM
టిప్పు సుల్తాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం Thu, May 02, 2024, 01:51 PM