అతడు పాములతో ప్రేమలో పడ్డాడు!

by సూర్య | Sat, Jan 16, 2021, 12:49 PM

ఇండియాకు చెందిన నీలం కుమార్ ఖైర్ అనే వ్యక్తి.. ఏకంగా 72 విషసర్పాలతో 72 గంటలు గడిపి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఘనత ఇప్పుడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో సైతం నమోదైంది. ఈ సాహసం 1982లో చోటుచేసుకుంది. పుణెకు చెందిన నీలం 28 ఏళ్ల వయస్సులోనే పాములతో ప్రేమలో పడ్డాడు. పాములను చంపేయడం నీలంకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. దీంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విష సర్పాలతో నిండిన గాజు చాంబర్‌లో ఎలాంటి ఆయుధాలు లేకుండా ఒంటరిగా మూడు రోజులు గడిపాడు. ఆ 72 గంటల్లో ఒక్క పాము కూడా నీలం కుమార్‌ ను కాటేయలేదు.
అతడు చేసిన ఈ సాహసం గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లో కూడా నమోదైంది. ఆ తర్వాత అతడు అతడు పుణె మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో 1982లో కాట్రాజ్ స్నేక్ పార్క్‌ ను నిర్మించాడు. ఇప్పుడు ఆ పార్క్‌.. రాజీవ్‌ గాంధీ జూలాజికల్ పార్క్‌ గా అభివృద్ధి చేశారు. నీలం కుమార్ ఇప్పుడు జంతువుల అనాథ శరణాలయాన్ని కూడా మొదలుపెట్టాడు.
పాములను మనం ఏమైనే చేస్తేనే.. అవి మనల్ని కాటు వేస్తాయని, లేకపోతే అవి మనల్ని ఏమీ చేయవని నిరూపించడానికే ఈ సాహసం చేశానని నీలం తెలిపారు.

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM