బ్యాంక్ కీలక నిర్ణయం

by సూర్య | Sat, Jan 16, 2021, 11:46 AM

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తన కస్టమర్లకు తీపికబురు అందించింది. కీలక నిర్ణయం తీసుకుంది. రుణ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రుణ గ్రహీతలకు ప్రయోజనం కలుగనుంది.మార్చినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు MCLR లో కోత విధిస్తున్నట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఎంసీఎల్ఆర్ రేటును 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 15 బేసిస్ పాయింట్లు తగ్గింది. నెల కాల పరిమితిలోని ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్లు దిగొచ్చింది.రేట్ల తగ్గింపు నిర్ణయం తర్వాత ఇప్పుడు ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 6.6 శాతంగా ఉంది. ఇదివరకు ఈ ఎంసీఎల్ఆర్ రేటు 6.75 శాతంగా ఉండేది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 6.7 శాతానికి తగ్గింది. ఇది వరకు ఈ రేటు 6.75 శాతంగా ఉండేది. ఎంసీఎల్ఆర్ రేట్ల తగ్గింపు నిర్ణయం జనవరి 11 నుంచే అమలులోకి వచ్చిందని బ్యాంక్ తెలిపింది.


 


అలాగే బ్యాంక్‌కు 3 నెలల ఎంసీఎల్ఆర్ 6.9 శాతంగా ఉంది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 7.05 శాతంగా కొనసాగుతోంది. అదేసమయంలో ఏడాది ఎంసీఎల్ఆర్ 7.2 శాతంగా ఉంది. బ్యాంకులు సాధారణంగా ఏడాది ఎంసీఎల్ఆర్ రేటును రుణాలను ప్రాతిపదికగా తీసుకుంటాయి. కాగా ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ వంటివి యూనియన్ బ్యాంక్‌లో విలీనమైన విషయం తెలిసిందే.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM