వాట్సప్‌పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

by సూర్య | Fri, Jan 15, 2021, 10:57 AM

ఫేస్‌బుక్‌కు మరో కొత్త తలనొప్పి మొదలైంది. యూజర్లపై నిఘా పెట్టిన వాట్సప్ తమ వ్యక్తిగత గోప్యత, డేటా భద్రతకు ప్రమాదం తెస్తోందంటూ జనవరి 14న వాట్సప్ పై ఢిల్లీ హైకోర్టులో కేసు నమోదైంది. క్యాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న వాట్సప్ జనవరి 4వ తేదీన వెల్లడించిన సమాచారం మేరకు వాట్సప్ వినియోగదారుల లొకేషన్, ఫోన్ నంబర్ వంటి మొత్తం సమాచారాన్నితమ సంస్థలైన ఇన్‌స్టాగ్రామ్, మెస్సెంజర్, ఫేస్‌బుక్‌లతో పంచుకోనుంది. వాట్సప్‌కు అతిపెద్ద మార్కెట్ మన దేశమే. మనదేశంలో 400 మిలియన్ల యూజర్లున్న వాట్సప్ చర్యలపై భారతీయులు భగ్గుమంటున్నారు. దీంతో మనవాళ్లు వాట్సప్ కు పోటీగా సేవలందిస్తున్న సిగ్నల్), టెలిగ్రాం వంటి మెస్సేజింగ్ యాప్స్‌ను డౌన్ లోడ్ చేసుకోవటం మొదలుపెట్టారు. ఇక వాట్సప్ కొత్త పాలసీ వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని, ఆన్ లైన్ యాక్టివిటీపై 360 డిగ్రీల వర్చువల్ ప్రొఫైల్ పై నిఘా పెట్టడమంటే పర్సనల్ ప్రైవసీకి భంగం వాటిల్లచేయటమేనంటూ ఢిల్లీ హై కోర్టులో చైతన్య రోహిల్లా అనే లాయర్ వాదించారు.


 


కేవలం వ్యక్తులే కాకుండా దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా వాట్సప్ చర్యలున్నాయన్న వాదనలు ప్రపంచవ్యాప్తంగా బలంగా వినిపిస్తున్నాయి. ఒకదేశానికి చెందిన వ్యక్తుల డేటాను ఇలా వేరే దేశంతో పంచుకోవటమంటే అది దేశ భద్రతకే అతి పెద్ద సవాలు అని పిటీషన్ లో పేర్కొనటం విశేషం. వ్యక్తిగత గోప్యత అనే ప్రాథమిక హక్కును వాట్సప్ సంస్థ ఉల్లంఘించి, తమాషా చేస్తోందని పిటీషనర్ ఆరోపించారు. అయితే ఈ కొత్త కండిషన్లను అంగీకరించేందుకు ఫిబ్రవరి 8 వరకు యూజర్లకు వాట్సప్ సంస్థ గడువు ఇచ్చింది. ప్రాథమిక హక్కును హరించే ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్యంలో చెల్లుబాటుకావంటూ భారత రాజ్యాంగం ప్రకారం ఇవి చెల్లవంటూ పిటినర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. కానీ దీనిపై వాట్సప్ సంస్థ ఎటువంటి స్పందన వెల్లడించలేదు. గ్రూప్ చాట్లపై దీని ప్రభావం ఉండదని కేవలం బిజినెస్ చాట్లపైనే ప్రభావం ఉండవచ్చని గతంలోనే వాట్సప్ వెల్లడించింది.


 


ప్రపంచవ్యాప్తంగా వాట్సప్ కొత్త నియమాలపై గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు టర్కీ వంటి దేశాల్లో కూడా వాట్సప్ కొత్త నిర్ణయంపై విచారణ ప్రారంభమైంది. వివిధ దేశాల్లో వాట్సప్ ను అన్ ఇన్స్టాల్ చేస్తూ ప్రత్యామ్నాయ మెసేంజర్లను డౌన్ లోడ్ చేసుకుంటన్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వాట్సప్ యూజర్స్ డేటాను ఆ సంస్థ ఇతర సంస్థలతో పంచుకుంటే జరగబోయే పరిణామాలపై సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వాట్సప్ ప్రైవసీ పాలసీపై చర్చ జోరుగా సాగుతోంది. నిజానికి 2014లోనే వాట్సప్ కంపెనీని ఫేస్ బుక్ కొనుగోలు చేయగా.. అప్పటి నుంచీ వాట్సప్ యూజర్స్ డేటాను ఫేస్ బుక్ కు షేర్ చేస్తున్నారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది. ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రాంతో పాటు థర్డ్ పార్టీ సంస్థలతోనూ ఐపీ అడ్రస్ డేటాను వాట్సప్ షేర్ చేస్తోంది. తాజాగా బ్యాటరీ లెవెల్, సిగ్నల్, యాప్ వర్షన్, లాంగ్వేజ్, మొబైల్ టైమ్ జోన్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ వంటి బోలెడంత డేటాను వాట్సప్ సమీకరించి, ఇతర సంస్థలతో షేర్ చేసుకోనున్నట్టు, ఇందుకు యూజర్స్ తమ అంగీకారాన్ని తెలపాలని కోరింది.

Latest News

 
టీడీపీ అభ్యర్థికి మద్దతుగా హీరో నిఖిల్ ప్రచారం Thu, May 02, 2024, 05:01 PM
పుదుచ్చేరి మద్యం పట్టివేత Thu, May 02, 2024, 04:51 PM
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి రాంబాబు Thu, May 02, 2024, 04:38 PM
టీడీపీలో చేరిన పలు కుటుంబాలు Thu, May 02, 2024, 04:32 PM
సినీ నటుడు సిద్ధార్థ నిఖిల్ ఎన్నికల ప్రచారం Thu, May 02, 2024, 04:30 PM