గుజరాత్ మాజీ సీఎం మాధవసిన్హా సోలంకి కన్నుమూత

by సూర్య | Sat, Jan 09, 2021, 09:32 AM

అహ్మదాబాద్ (గుజరాత్): వెటరన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, గుజరాత్ మాజీ సీఎం మాధవసిన్హా సోలంకి శనివారం ఉదయం కన్నుమూశారు. 94 ఏళ్ల వయసుగల సోలంకి గుజరాత్ సీఎంతో పాటు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన సోలంకి 1980వ సంవత్సరంలో క్షత్రియ, హరిజన్, ఆదివాసీ, ముస్లిమ్ ఫార్ములాతో గుజరాత్ సీఎంగా ఎన్నికయ్యారు. 1976వ సంవత్సరంలో కొంత కాలం సోలంకి సీఎంగా పనిచేశారు. మళ్లీ 1981లోనూ సీఎం అయిన సోలంకి ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించారు.1985వ సంవత్సరంలో మాధవసిన్హా సోలంకి రాజీనామా చేశారు.సోలంకి మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు.

Latest News

 
రైలు పట్టాలపై గుర్తు తెలియని యువకుడు మృతదేహం Sat, May 18, 2024, 05:27 PM
మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయండి Sat, May 18, 2024, 05:24 PM
ప్రశాంత వాతావరణం కోసమే బయటి ప్రాంతాలకు ఆది, భూపేశ్ Sat, May 18, 2024, 05:22 PM
ఘనంగా శ్రీ వాసవి మాతా జయంతి ఉత్సవాలు Sat, May 18, 2024, 05:20 PM
సోషియల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కఠిన చర్యలు Sat, May 18, 2024, 05:19 PM