చెన్నై ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు..

by సూర్య | Tue, Oct 20, 2020, 09:37 AM

ఈ సీజన్ ఐపీఎల్‌లో చెన్నై జట్టు చాలా పేలవ ప్రదర్శన కనపరుస్తోంది. ఇప్పటివరకు ఆడిని 9 మ్యాచుల్లో కేవలం 3 మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించింది. చెన్నై ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఇకపై జరుగనున్న ప్రతి మ్యాచ్ చెన్నైకి కీలకం కానుంది. ఇంకా ఐదు లీగ్ మ్యాచ్ లు మిగిలున్నాయి. చెన్నై ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ 5 మ్యాచ్ ల్లో చెన్నై తప్పకుండా గెలవాలి. ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో చెన్నై చెత్త ప్రదర్శన కనపరచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది.


 


 చెన్నై ఆటగాళ్లలో ధోనీ (28), జడేజా (35), శామ్ కరన్(22), డుప్లెసిస్ (10) పరుగులు చేశారు. చెన్నై ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క సిక్సర్ నమోదు నమోదైంది. తరువాత 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కూడా తొలుత ఇబ్బంది పడింది. ఓపెనర్లు తక్కువ స్కోర్‌కే అవుట్ అయ్యారు. బెన్‌స్టోక్స్ 19 పరుగులకే అవుట్ కాగా, రాబిన్ ఉతప్ప 4 పరుగులే చేశాడు. సంజు శాంసన్ (0) నిరాశపరిచాడు. కెప్టెన్ స్మిత్ 26 పరుగులు చేయగా, చివర్లో జోస్ బట్లర్(70) పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ విజయంతో రాజస్థాన్ 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి ఐదో స్థానానికి చేరుకుంది. తద్వారా ప్లే ఆఫ్ రేసులో నిలిచింది.


 


 

Latest News

 
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM