సిఎం జగన్‌పై నారా లోకేశ్‌ విమర్శలు

by సూర్య | Mon, Oct 12, 2020, 02:57 PM

టిడిపి నేత నారా లోకేశ్‌ సిఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. అమరావతి రైతుల పోరాటం 300వ రోజుకు చేరిన నేపథ్యంలో ఆయన స్పందిస్తూ… ‘ముందుతరాలకు కూడా మేలు చేయడానికి దార్శనికతతో చేసే పనులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు రాజధానిగా అమరావతి నిర్మాణం. వ్యక్తిగత ప్రయోజనాల కోసం స్వార్థపరులు చేసే పనులు కొన్ని ఉంటాయి. అదే మూడు రాజధానుల నాటకం. మూడు రాజధానులతో వచ్చే ముప్పు తెలుసుకుని అమరావతిని కాపాడుకుందాం’ అని చెప్పారు.


‘జై అమరావతి ఉద్యమం మొదలై 300 రోజులైంది. హింసించే 24వ రాజు వైఎస్ జగన్ మాట మార్చి, మడమ తిప్పి నేటికి 300 రోజులు. అరెస్టులు, అవమానాలు, కేసులతో రాబందుల్లా వెంటాడుతున్నా ఎత్తిన జెండా దించకుండా జై అమరావతి అంటున్న రైతులు, మహిళలు, యువత, ఉద్యమకారులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను’ అంటూ నారా లోకేశ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ‘మనస్సున్న వాడికి రైతు కష్టం తెలుస్తుంది. మూర్ఖుడికి హింసించడం మాత్రమే తెలుస్తుంది. మనం మూర్ఖుడితో పోరాటం చేస్తున్నాం. ఇదొక సుదీర్ఘ పోరాటం. ఓర్పు, సహనంతో ఉంటే అంతిమ విజయం మనదే’ అని నారా లోకేశ్ ట్వీట్లు చేశారు.


 


 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM