జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ ఈ నెల 12 కి వాయిదా

by సూర్య | Fri, Oct 09, 2020, 03:10 PM

హైదరాబాద్‌లోని సిబిఐ, ఈడీ కోర్టుల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ ఈ నెల 12 కి వాయిదా పడింది. కాగా, జగన్‌, విజయసాయిరెడ్డి, ఇతర నిందితులు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేయగా, వాటిని కోర్టు అంగీకరించింది. ఈ కేసులకు సంబంధించి ప్రతీ శుక్రవారం విచారణ జరిగేది. అయితే ఇటీవల సుప్రీం కోర్టు ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులను సత్వర విచారణ చేపట్టాలని సూచించింది. దీనిపై స్పందించిన హైకోర్టు రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేసు విచారణను సిబిఐ కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. కరోనా నేపథ్యంలో కోర్టు హాలులో ఎక్కువమంది న్యాయవాదులు, నిందితులు ఉండటం ఇబ్బందిగా ఉండటంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టాలని, జగన్‌ తరపు న్యాయవాదులు కోరారు. తాము కూడా విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, దీనిపై స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జగన్‌ కేసులో నాలుగు ఛార్జిషీట్లకు సంబంధించి హైకోర్టులో స్టే ఉంది. స్టే ఉన్న కేసులను నవంబర్‌ 9 కి వాయిదా వేస్తున్నట్లు సిబిఐ కోర్టు తెలిపింది.


 


 

Latest News

 
మరో వారం రోజుల్లో పోలింగ్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు Mon, May 06, 2024, 09:47 PM
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త.. ఇక నో టెన్షన్ Mon, May 06, 2024, 08:54 PM
ఇదంతా ఆ ముగ్గురి కుట్ర, నాలుగేళ్లగా జరుగుతోంది.. అల్లుడు గౌతమ్ వ్యాఖ్యలపై మంత్రి రాంబాబు స్పందన Mon, May 06, 2024, 08:00 PM