కరోనా ఎఫెక్ట్‌: NEET పరీక్ష వాయిదా

by సూర్య | Sat, Mar 28, 2020, 12:30 PM

కరోనా వైరస్‌ ప్రభావం అన్ని రంగాలపై పడింది. ఇప్పటికే ఏప్రిల్‌ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కేంద్రం ప్రకటించింది. పలు రాష్ట్రాల్లో పది, ఇంటర్‌, ఇతర పరీక్షలు వాయిదా పడ్డాయి. అదే క్రమంలో జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (NEET నీట్‌)ను వాయిదా వేస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయం తీసుకుంది. మే3న నీట్‌ పరీక్ష జరగాల్సి ఉంది. మార్చి 27న అడ్మిట్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సింది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది.

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM