నేడు కరోనాపై జీ-20 దేశాధినేతలు అత్యవసర సమావేశం

by సూర్య | Thu, Mar 26, 2020, 01:52 PM

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నియంత్రణపై చర్చించేందుకు గురువారం భారత ప్రధాని మోదీ సహా జీ-20 దేశాధినేతలు అత్యవసరంగా సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించే ఈ సమావేశంలో వీరంతా పాల్గొంటారు. అసాధారణ రీతిలో తలపెట్టిన ఈ కార్యక్రమానికి సౌదీ అరేబియా రాజు సల్మాన్‌ బిన్‌ అబ్దుల్ అజీజ్‌ అల్‌ సౌద్‌ నేతృత్వం వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలపైనా, ఆర్థిక వ్యవస్థల పైనా తీవ్ర ప్రభావం చూపుతున్న మహమ్మారిని నిరోధించేందుకు సమన్వయంతో ఎలా పనిచేయాలన్న విషయమై వీరంతా చర్చిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ జీ-20 సమావేశం కోసం తాను ఎదురు చూస్తున్నానని, కొవిడ్‌-19 మహమ్మారి నివారణకు అంతర్జాతీయంగా ఎలాంటి పాత్ర పోషించాలన్న విషయమై ఈ సందర్భంగా చర్చిస్తామని మోదీ ట్వీట్‌ చేశారు.

Latest News

 
టిడిపి అరాచకం మాదిగలపై దాడి Mon, May 06, 2024, 03:59 PM
అల్లి నగరంలో ఎన్నికల ప్రచారం Mon, May 06, 2024, 03:55 PM
పోస్టల్ బ్యాలెట్స్ కి అపూర్వ స్పందన Mon, May 06, 2024, 03:53 PM
పేదల సంక్షేమమే వైసీపీ ధ్యేయం: నాగార్జున Mon, May 06, 2024, 03:51 PM
భైరవకోనలో ప్రత్యేక పూజలు Mon, May 06, 2024, 03:49 PM