కరోనా ఎఫెక్ట్.. ఢిల్లీ ప్రజలకు కేజ్రివాల్ శుభవార్త

by సూర్య | Sat, Mar 21, 2020, 06:53 PM

కరోనా ప్రభావంతో ప్రపంచం అతలాకుతలం అవుతోంది. ఒక పక్క వైరస్ వ్యాప్తితో ప్రజలు చావుతో యుద్ధం చేస్తుంటే మరోవైపు ఉపాధి లేక ఆకలికి అల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి దేశంలోనూ తీవ్ర స్థాయిలోనే ఉంది. అయితే సత్వర అవసరం కింది ఢిల్లీలోని 72 లక్షల కుటుంబాలకు రేషన్ అందించనున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రివాల్ ప్రకటించారు. అంతే కాకుండా 8.5 లక్షల లబ్దిదారులకు 4 వేల రూపాయల నుంచి 5 వేల రూపాయల వరకు పెన్షన్ అందించనున్నట్లు తెలిపారు. సాధారణ ఇచ్చే వాటి కంటే రేషన్ 50 శాతం ఎక్కువ ఇస్తున్నట్లు.. ఇక పెన్షన్లలోనూ రెండు రెట్ల పెరుగుదల ఉన్నట్లు అరవింద్ కేజ్రివాల్ పేర్కొన్నారు.
ఢిల్లీలోని ప్రతి ఒక్కరికి మధ్యాహ్న భోజనాన్ని అందించబోతున్నట్లు కేజ్రివాల్ ప్రకటించారు. ఇక ఎవరికైతే క్వారంటైన్ అవసరముంటుందో.. వారి హోటల్ ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తుందని ఆయన పేర్కొన్నారు. కరోనా వల్ల పేద ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని, వారిని ఆపన్నహస్తం అందించడంలో భాగంగానే బియ్యం, రేషన్ ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇలాంటి సమయంలో వెంటనే నిత్యవసరాలు అందించి పేదవారికి ఊరటనివ్వాల్సిన అవసరం ఉందని కేజ్రివాల్ అన్నారు.

Latest News

 
అందుక‌నే బయటకు వచ్చేశా: అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 12:08 PM
ఆ ఫైలు మీద‌నే తొలి సంతకం: నారా లోకేశ్ Sun, Apr 28, 2024, 12:07 PM
ఆడారిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి Sun, Apr 28, 2024, 12:06 PM
దక్షిణలో ఫ్యాన్ గాలులు: వాసుప‌ల్లి Sun, Apr 28, 2024, 12:06 PM
పిఠాపురంలో రెండు రోజులు పవన్ పర్యటన Sun, Apr 28, 2024, 10:22 AM