మీ కోచింగ్‌ పదవి నాకొద్దు..

by సూర్య | Thu, Mar 19, 2020, 12:33 PM

బంగ్లాదేశ్‌ జట్టు తమ టెస్టు జట్టు బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా పని చేయాలంటూ చేసిన ప్రతిపాదనను భారత మాజీ ఆటగాడు సంజయ్‌ బంగర్‌ తిరస్కరించాడు. ముందే కుదుర్చుకున్న ప్రొఫెషనల్‌ ఒప్పందాలతో పాటు వ్యక్తిగత అం శాలు కూడా ఇందుకు కారణమని అతను చెప్పాడు. 12 టెస్టులు, 15 వన్డేలు ఆడిన బంగర్‌ భారత జట్టు బ్యాటింగ్‌ కోచ్‌గా ఐదేళ్ల పాటు అద్భుతమైన ఫలితాలు సాధించాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్‌ లోపాలను సరిదిద్ది వారిని అత్యుత్తమంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాడు. తమ టెస్టు జట్టును పటిష్టపర్చేందుకు బంగ్లాదేశ్‌ బంగర్‌ సేవలను కోరింది. అయితే ప్రస్తుతం కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న అతను తన వల్ల కాదని చెప్పాడు. ఇప్పటికే బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు నీల్‌ మెకెంజీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాను పరిమిత ఓవర్లు, టీ 20లకు మాత్రమే బ్యాటింగ్‌ కోచ్‌గా కొనసాగుతానని కొద్దిరోజుల క్రితం బీసీబీకి తెలిపాడు. దీంతో టెస్టు ఫార్మాట్‌కు కొత్త బ్యాటింగ్‌ కోచ్‌కు అన్వేషణ మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే బీసీబీ సంజయ్‌ బంగర్‌ను కలిసినట్లు తెలిసింది. కాగా టెస్టులకు కొత్త బ్యాటింగ్‌ కోచ్‌ వచ్చేవరకు మెకేంజీనే మూడు ఫార్మాట్లలో బ్యాటింగ్‌ కోచ్‌గా కొనసాగుతాడని బీసీబీ స్పష్టం చేసింది. కాగా సంజయ్‌ బంగర్‌ 2014 నుంచి 2019 వరకు టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌గా పనిచేశాడు.

Latest News

 
ఏపీలో మరో ఘోరం.. చిత్తూరు జిల్లాలో రెండులారీలు, ట్రాక్టర్ ఢీ. Wed, May 15, 2024, 11:24 PM
వైఎస్ జగన్ నివాసంలో ముగిసిన 41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగం Wed, May 15, 2024, 11:19 PM
రూ.3500 సాయం అడిగింది నేనే.. నా అకౌంట్ హ్యాక్ కాలేదు: రేణూ దేశాయ్ Wed, May 15, 2024, 09:50 PM
ఏపీలో మరో మూడురోజులు వానలు.. రేపు ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ Wed, May 15, 2024, 09:49 PM
ఏపీలోని ఈ నియోజకవర్గాల్లో 144 సెక్షన్.. ప్రజల్ని అలర్ట్ చేసిన పోలీసులు Wed, May 15, 2024, 08:38 PM