వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది

by సూర్య | Thu, Jan 16, 2020, 10:55 AM

కడప: చిత్తూరు నుంచి కాచిగూడ వెళ్తున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలు కడప జిల్లాలోని ఓబులవారిపల్లె వద్దకు రాగానే పట్టా విరిగినట్టు గుర్తించి నిలిపివేశారు. అనంతరం రైల్వే సిబ్బందికి సమాచారం అందించడంతో వారొచ్చి మరమ్మతులు చేపట్టారు. ఆ తర్వాత రైలు బయలుదేరింది. విరిగిన పట్టాను గుర్తించకుంటే పండుగ వేళ పెను ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. మరమ్మతుల కారణంగా రైలు దాదాపు గంటపాటు నిలిచిపోయింది. ప్రమాదం నుంచి బయటపడిన విషయం తెలిసిన ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.


 


 

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM