పుట్ట‌క ముందే గిట్టిన పార్టీ ర‌జ‌నీదేనా?

by సూర్య | Mon, Oct 14, 2019, 06:36 PM

నిన్న‌మెన్న‌టి వ‌ర‌కు రాజ‌కీయాల‌లోకి అదుగో... ఇదుగో వ‌స్తున్నానంటూ అభిమానుల్లో ఉత్సాహం రేపిన త‌మిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజ‌కీయాల‌ను ప‌క్క‌కు పెట్టి మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నట్టే క‌నిపిస్తోందంటున్నారు సినీ విశ్లేష‌కులు.  హిమాలయ ఆధ్యాత్మిక యాత్రకు  వెళ్లే ముందు కళానిధి మారన్ సన్ పిక్చర్స్ తరఫున ఒక సినిమా చేసేందుకు సంతకం చేశారు. బిజెపికి ఒకానొక‌క స‌మ‌యంలో ద‌గ్గ‌ర‌గా వెళ్లిన ఆయ‌న డిసెంబర్ 32, 2017 న  వేలాది మంది అభిమానులనుద్దేశించి ప్రసంగిస్తూ రాజకీయ పొలికేక వేశారు. ‘ఇదొక యుద్దం, నిజంగా ఇదొక యుద్ధం. యుద్ధానికి సన్నద్దం కండి,’ అని వాళ్లకు పిలుపు ఇవ్వ‌టంతో జయలలిత, కరుణానిధి చనిపోయాక, తమిళనాడు రాజకీయాల్లో పెద్ద దిక్కవుతార‌ని అంతా అనుకున్నారు.  పాతబడిన తమిళ ద్రవిడ రాజకీయాల కొత్త రాజకీయ చ‌రిత్ర రాయ‌నున్నాడంటూ ర‌జ‌నీపై వ‌చ్చిన క‌థ‌నాలు కూడా బోలెడు. 2017లో ఉన్న ఉత్సాహంలో ఆయన తన అభిమాన సంఘాన్ని  రజినీ మక్కల్ మండ్రమ్ (RMM) గా మార్చారు. అదే పార్టీ పేరుకూడా అదేన‌ని అభిమానులు ప్ర‌చారం చేసారు. ఈ సంస్థకు ఆఫీస్ బేరర్లను నియమించారు. అన్ని స్థాయిలో బాధ్యులను కూడా నియమించారు.  అధికారికంగా రాజకీయ పార్టీని ప్రకటించేందుకు అవసరమయిన త‌తంగం అంతా 90% పూర్తయిందని ఇక ప్ర‌క‌ట‌నే త‌రువాయ‌న్నంత హ‌డావిడి చేసారు. ఈ మధ్యలో 2019 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమొచ్చినా పోటీ చేయ‌లేదు స‌రిక‌దా ఎవరికీ మద్దతునిచ్చేది లేద‌ని ఖ‌రాకండీ గా ప్ర‌క‌టించారు.  అభిమానుల నుంచి వత్తిడి వస్తూండటంతో  ఆయన సర్కిల్స్ నుంచి  మార్చి 2020లో పార్టీని ప్రకటిస్తారనే వార్తలు లీ కయ్యాయి అప్ప‌టిలో కానీ ర‌జ‌నీ మాత్రం రాజ‌కీయాలు మిన‌హా అన్ని మాట్లాడుతున్నాడు.
అయితే తాజా ప‌రిస్థితి చూస్తుంటే  ర‌జ‌నీ రాజకీయాల పట్ల సీరియస్ గా ఉన్నారా అనే అనుమానం  క‌లుగుతుందంటున్నారు జ‌నం.  రాజ‌కీయాల‌లోకి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించిన నాటి నుంచి వ‌రుస‌గా సినిమాల మీద సినిమాలు చేస్తు, ఇంతవరకు నాలుగు సినిమాల్లో నటించారు. అయిదోది  ఇపుడు సంతకం చేయ‌టం ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మ‌వుతోంది.
మ‌రోవైపు తమిళనాడు అసెంబ్లి ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. 20 నెలల్లో అక్కడ ఎన్నికలొస్తాయి. ఎన్నికల్లో 234 స్థానాల్లో తన పార్టీ పోటీ చేస్తుందన్న గర్జించిన వ్యక్తి ఆ దిశలో ఇంతవరకు  ఓ ప్ర‌య‌త్నం కూడా క‌నిపించ‌డంలేదు. పైగా  డిఎంకె వర్గానికి చెందిన సన్ పిక్చర్స్ తో చిత్రానికి ఒప్పుకోవడంతో ఆయన రాజకీయ పార్టీ ఏర్పాటు మీద సర్వత్రా అనుమానాలు జోరందుకున్నాయి. ఎఐడిఎంకె, డిఎంకె వర్గాలు కూడా రజనీకాంత్ రాజకీయ పార్టీ ఏర్పాటు మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయ్.
2021లో అసెంబ్లీ ఎన్నికలు పెట్టుకుని పార్టీ, రాష్ట్రం, రాజ‌కీయాల గురించి ఆలోచించకుండా  వ‌రుస సినిమాలు ఒప్పుకుంటు ఉండటంలో అర్థమేమిటి? అని  ముందు క‌నీసం పార్టీ పేరు ప్రకటించమనండి తర్వాత చూద్దాం, అని వారు ఎద్దేవా చేస్తున్నారు మ‌రి కొంద‌రు సామాజిక మీడియాలో.  కొంద‌రైతే... ర‌జ‌నీ రాజ‌కీయ పార్టీ ఇంకా పెట్ట‌క ముందే... అప్పుడే గిట్టిందంటూ సెటైర్లూ వేస్తున్నారు. 


 


 

Latest News

 
సీఎం జగన్ పై మండిపడ్డ జేడీ Sun, May 19, 2024, 02:14 PM
జగన్, మోడీ ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయం Sun, May 19, 2024, 02:13 PM
క్రీడాకారునికి చేయూత Sun, May 19, 2024, 02:12 PM
మోదీ సర్కార్ కి దెబ్బ తగలనుంది Sun, May 19, 2024, 02:12 PM
తాడిపత్రిలో సిట్ బృందం దర్యాప్తు Sun, May 19, 2024, 02:02 PM