దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు ఘనవిజ‌యం

by సూర్య | Mon, Oct 14, 2019, 07:34 AM

దక్షిణాఫ్రికాతో పుణె వేదికగా ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు ఘన విజయాన్ని అందుకుంది. ఇంకా ఒక టెస్టు మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు టెస్టుల సిరీస్‌ని 2-0తో టీమిండియా చేజిక్కించుకుంది. భారత్ జట్టుకి సొంతగడ్డపై ఇది వరుసగా 11వ టెస్టు సిరీస్ గెలుపుకాగా.. 10 ఏళ్లనాటి ఆస్ట్రేలియా రికార్డ్ బ్రేక్ అయ్యింది. సొంతగడ్డపై వరుసగా ఎక్కువ టెస్టు సిరీస్‌లు గెలిచిన జట్టుగా ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా 10 సిరీస్ విజయాలతో అగ్రస్థానంలో ఉండగా.. భారత్ జట్టు తాజా సిరీస్‌ విజయంతో ఆ రికార్డ్‌ని కనుమరుగు చేసింది. 1994-2001, 2004-09 మధ్యకాలంలో కంగారూలు తమ సొంతగడ్డపై రెండు సార్లు వరుసగా 10 టెస్టు సిరీస్‌లు గెలిచారు. భారత్ జట్టు 2012-19 మధ్యకాలంలో వరుసగా 11 టెస్టు సిరీస్ విజయాలతో ఆస్ట్రేలియా రికార్డ్‌ని అధిగమించింది. భారత్ గడ్డపై 2012-13లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ని 4-0తో గెలిచిన టీమిండియా.. ఆ తర్వాత వెస్టిండీస్ (2-0), దక్షిణాఫ్రికా (3-0), న్యూజిలాండ్ (3-0), ఇంగ్లాండ్ (4-0), బంగ్లాదేశ్ (1-0) మళ్లీ ఆస్ట్రేలియా (2-1), శ్రీలంక (1-0), అఫ్గానిస్థాన్ (1-0).. తాజాగా మళ్లీ దక్షిణాఫ్రికా (2-0*)లను ఓడించి ఈ రికార్డ్ నెలకొల్పింది. ఈ ఏడేళ్లలో సొంతగడ్డపై కేవలం ఒకే ఒక టెస్టు మ్యాచ్‌లో మాత్రమే భారత్ జట్టు ఓడింది. అది కూడా 2017లో ఆస్ట్రేలియా చేతిలో..!

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM