లక్నో విమానాశ్రయంలో బాంబు కలకలం

by సూర్య | Sun, Oct 13, 2019, 06:05 PM

ఉత్తరప్రదేశ్ లక్నోలోని అమౌసీ ఎయిర్‌పోర్టులో చెన్నై వెళుతున్న ఇండిగో ఫ్లయిట్‌లో బాంబు ఉందన్న సమాచారంతో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. దీంతో సెక్యూరిటీ అధికారులు విమానంలోని నలుమూలలా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఎటువంటి అనుమానాస్పద వస్తువు లభ్యం కాకపోవడంతో బాంబు ఉందన్న సమాచారం నిరాధారమని తేలింది. దీంతో అప్పటివరకూ ఆందోళనకు గురైన ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ సమాచారం అందించిన పీయూష్ వర్మ అనే వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకుంది. పీయూష్ వర్మ షాజహాన్‌పూర్ జిల్లా ఆసుపత్రిలో క్వాలిటీ మేనేజర్‌గా పనిచేస్తున్నాడని వెల్లడైంది. పీయూష్ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. బాంబు లేదని తేలిన నేపధ్యంలో ఆ విమానం చెన్నైకి బయలుదేరింది.

Latest News

 
ఏపీ రాష్ట్రంలో సెంటు భూమి ఉన్నవాళ్లయినా సరే... చాలా జాగ్రత్తగా ఉండాలి : పవన్ కళ్యాణ్ Mon, Apr 29, 2024, 10:20 PM
ఆస్తి కోసం తండ్రిని చావబాదిన కొడుకు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి Mon, Apr 29, 2024, 10:16 PM
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM
నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే Mon, Apr 29, 2024, 08:54 PM
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM