ముద్దాయిగా ఉంటూ సుప్రీంకోర్టుకు లేఖ రాసే అర్హత ఉందా!

by సూర్య | Fri, Oct 11, 2019, 09:41 PM

వివిధ కేసుల్లో ముద్దాయిగా ఉంటూ బెయిల్‌పై బయటకు వచ్చి.. విచారణల నిమిత్తం కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఓ మద్దాయి విజయసాయి రెడ్డికి సుప్రీంకోర్టుకు లేఖ రాసే అర్హత ఉందా అంటూ తెలుగు దేశం నేత వ‌ర్ల రామ‌య్య‌ ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రతి శుక్రవారం కోర్టుమెట్లు ఎక్కే విజయసాయిరెడ్డి కోర్టు కంట్రోల్‌లో ఉన్నాడు. విజయసాయిరెడ్డికి స్వేచ్ఛ లేదు. ఒక ముద్దాయిగా బెయిల్ మీద ఉన్న విజయసాయిరెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసే అర్హత లేదు. అత్యున్నత న్యాయస్థానానికి లెటర్ రాసే అర్హత విజయసాయిరెడ్డికి లేదు. తన కేసుల విషయంలో సుప్రీంకోర్టుకు లెటర్ రాసుకోవచ్చు కానీ వేరేవాళ్ళ విషయాలలో తల దూర్చకూడదు. బెయిల్ కేన్సిల్ అయితే ఏదో ఒక జైలుకు వెళ్ళాల్సిన విజయసాయిరెడ్డి సుప్రీంకోర్టుకు లెటర్ రాయకూడదు. ప్రజా సమస్యల మీద పోరాడచ్చు, కానీ భారతదేశ సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్‌కు లేఖ రాయకూడదు.  ప్రభాకర్ రెడ్డి యూట్యూబ్ వేదికగా మాట్లాడిన మాటలు టిడిపి మహిళా నాయకురాలిని కించపరిచేలా ఉన్నాయి. ఎన్నికల సమయంలో మీడియాలో డిబేట్లలో వైసిపి తరపున ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నాడు. అమెరికా నుంచి ప్రభాకర్ రెడ్డిని తీసుకురాలేరా పోలీసులు. ఫిర్యాదు ఇవ్వడానికి టిడిపి నాయకులు వస్తే పోలీసులే అందుబాటులో ఉండరు. రేపు ప్రభాకర్ రెడ్డి మీద గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేస్తాం. సోషల్ మీడియా విషయాలపై టిడిపి పెట్టిన 50వ కేసు అవుతుంది. కంప్లైంట్‌లు, అరెస్టులు మాత్రం శూన్యం. పంచుమర్తి‌ అనూరాధ మీద యూట్యూబ్ వేదికగా పోస్టింగ్ పెట్టిన, అమెరికాలో ఉన్న ప్రభాకర్ రెడ్డిని తీసుకొచ్చి, అరెస్టు చేయాలి అంటూ వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM