దెయ్యం ఉంది కావాలంటే చూసుకో.. : ఓ అమెరికన్

by సూర్య | Fri, Aug 23, 2019, 05:04 PM

దెయ్యాలు ఉన్నాయా? భూమి పుట్టినప్పటి నుంచీ ఇదే ప్రశ్న. ఉన్నాయంటే ఉన్నాయి.. లేవంటే లేవు. ఎవరి నమ్మకం వారిది. కానీ అమెరికాలోని లాంగ్ ఐలండ్‌కు చెందిన జోయ్ నోలన్ మాత్రం దెయ్యాలు ఉన్నాయని బల్లగుద్ది మరీ వాదిస్తున్నాడు. కావాలంటే చూసుకోండి.. అంటూ తన ఇంట్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తన ఇంట్లో అందరూ నిద్రపోతున్న వేళ ఎవరో తిరుగుతున్న అలికి అవడంతో అనుమానం వచ్చిందని, లేచి చూస్తే ఎవరూ కనిపించేవారు కాదని చెప్పుకొచ్చాడు. ఎందుకైనా మంచిదని తన ఇంట్లోని సీసీటీవీ కెమెరాను పరిశీలిస్తే అసలు విషయం బయటపడిందని పేర్కొన్నాడు.


 


జోయ్ పోస్టు చేసిన వీడియోలో ఓ కుక్కపిల్ల ఆకారం, ఓ పిల్లాడి రూపు కనిపించింది. దీంతో ఉలిక్కిపడిన జోయ్.. దీనిని యూట్యూబ్‌లో పోస్టు చేసి ‘ఇవి దెయ్యాలేనా?’ అని నెటిజన్లను అడిగాడు. దీంతో ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. కొందరు తమకు తోచిన సలహాలు ఇస్తున్నారు. మరికొందరైతే ‘మీ ఇంట్లో ఇటీవలి కాలంలో ఎవరైనా చనిపోయారా?’ అని ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియోలో స్పష్టంగా ఏమీ కనిపించడం లేదని, కాకపోతే, ఏవో రెండు ఆకారాలు తిరుగుతున్నట్టుగా ఉందని ఆ నెటిజన్ పేర్కొన్నాడు. దీనికి జోయ్ బదులిస్తూ.. ఈ మధ్య ఎవరూ చనిపోలేదని పేర్కొన్నాడు. ఆగస్టు 8 నాడు మాత్రమే ఈ ఘటన జరిగిందని, దీనిని బట్టి చూస్తుంటే దీనికి, ఆగస్టు 8కి ఏదో సంబంధం ఉందని అనిపిస్తోందని చెప్పుకొచ్చాడు. 





 

Latest News

 
పొగాకు అత్యధిక ధర కేజీ రూ. 299 Fri, May 10, 2024, 03:57 PM
ఓటు హక్కు వినియోగించుకోవాలని బైక్ ర్యాలీ Fri, May 10, 2024, 03:55 PM
టీడీపీ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం Fri, May 10, 2024, 03:53 PM
మార్కాపురం నియోజకవర్గ అభివృద్దే నా ద్యేయం: జావీద్ అన్వర్ Fri, May 10, 2024, 03:51 PM
జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ తీసుకొద్దాం: అన్నా రాంబాబు Fri, May 10, 2024, 03:47 PM