పాకిస్థాన్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టిన ఎఫ్ఏటీఎఫ్

by సూర్య | Fri, Aug 23, 2019, 01:06 PM

పాకిస్థాన్ కు అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలపై నిఘా ఉంచే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) షాక్ ఇచ్చింది. టెర్రరిస్టు సంస్థలకు ఆర్థిక సాయం అందించడం, మనీ లాండరింగ్ కు పాల్పడటం వంటి కారణాలతో పాక్ ను బ్లాక్ లిస్ట్ లో ఉంచింది. టెర్రరిస్టులకు నిధులను అందించే అంశానికి సంబంధించిన 40 పారామితుల్లో 32 పారామితులు సమ్మతించే విధంగా లేవని ఎఫ్ఏటీఎఫ్ తెలిపింది. 41 మంది సభ్యుల ప్యానెల్ ను పాకిస్థాన్ తన వాదనతో ఒప్పించలేకపోయిందని వెల్లడించింది . మరోవైపు, బ్లిక్ లిస్టు నుంచి తప్పించుకోవడానికి అక్టోబరులోగా పాకిస్థాన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో అంతర్జాతీయ స్థాయిలో ఆ దేశ క్రెడిట్ రేటింగ్ పడిపోతుంది. ఆ దేశ ర్యాంకింగ్ ను ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ లు డౌన్ గ్రేడ్ చేస్తాయి.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM