బిడ్డకు జన్మనివ్వబోతున్న మహిళ దంపతులు

by సూర్య | Tue, Aug 20, 2019, 09:32 PM

అమీ శాటర్త్‌వైట్‌. న్యూజిలాండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు సారథి. లీ తహూహూ అదే జట్టులో సీనియర్‌ బౌలర్‌. మనసులు కలిశాయి. కట్టుబాట్లను విడనాడారు. అందర్నీ ఎదిరించారు. ప్రపంచంలోనే పెళ్లి చేసుకున్న తొలి మహిళల క్రికెట్‌ జంటగా చరిత్ర సృష్టించారు. తాజాగా ఈ దంపతులు ఓ తీపి కబురు చెప్పారు. ఏంటో తెలుసా? లీ తహూహూ ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది.
‘లీ, నేను ఈ విషయం చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నాం. కొత్త ఏడాదిలో మా జీవితాల్లోకి తొలి చిన్నారి రాబోతోంది. మా జీవితాల్లో ఇదొక ప్రత్యేక సమయం. ఈ కొత్త అధ్యాయం కోసం మేం ఎదురు చూడలేకపోతున్నాం’ అని అమీ ఇన్‌స్టాలో వెల్లడించింది. ‘బేబీ శాటర్ హుహు’ 2020 జనవరిలో రాబోతోందని ఓ చిత్రాన్ని ఉంచింది. ఈ సందర్భంగా శాటర్‌వైట్‌కు సైతం న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు వేతనంతో కూడిన మాతృత్వపు సెలవును మంజూరు చేయడం విశేషం. అయితే ఏ పద్ధతుల ద్వారా వీరు బిడ్డకు జన్మనిస్తున్నారో వెల్లడించలేదు. సెలవు తీసుకున్నప్పటికీ జట్టుకు మార్గనిర్దేశకు రాలిగా కొనసాగుతానని అమీ వెల్లడించింది. 2021 ప్రపంచకప్‌ నాటికి తిరిగి జట్టులో చేరుతానని పేర్కొంది. కివీస్‌ బోర్డు కొత్త విధానం ప్రకారం 2019-20 కాలానికి ఆమెకు కాంట్రాక్టుకు ఇస్తున్నారు. పూర్తిస్థాయిలో వేతనం చెల్లించనున్నారు. ‘ఒక కుటుంబంగా మారే క్రమంలో ఆట నుంచి విరామం తీసుకోవాడానికి న్యూజిలాండ్‌ క్రికెట్‌ ఎంతో మద్దతు ఇస్తున్నందుకు నేనెంతో అదృష్టవంతురాలిని. ఒక మార్గనిర్దేశకురాలిగా జట్టుకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటాను’ అని అమీ తెలిపింది. 32 ఏళ్ల ఆమె గతేడాది సారథ్యం అందుకుంది. ఇప్పటి వరకు 119 వన్డేలు, 99 టీ20లు ఆడింది. వన్డేల్లో వెంటవెంటనే నాలుగు శతకాలు చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. 28 ఏళ్ల తహూహూ 116 మ్యాచుల్లో 114 వికెట్లు పడగొట్టింది.

Latest News

 
ఏపీ రాష్ట్రంలో సెంటు భూమి ఉన్నవాళ్లయినా సరే... చాలా జాగ్రత్తగా ఉండాలి : పవన్ కళ్యాణ్ Mon, Apr 29, 2024, 10:20 PM
ఆస్తి కోసం తండ్రిని చావబాదిన కొడుకు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి Mon, Apr 29, 2024, 10:16 PM
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM
నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే Mon, Apr 29, 2024, 08:54 PM
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM