తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

by సూర్య | Tue, Aug 20, 2019, 05:30 PM


రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తరపున రాష్ట్ర మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నేత మహ్మద్‌ ఇక్బాల్‌, కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్‌ నేత చల్లా రామకృష్ణారెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. అనంతరం మహ్మద్‌ ఇక్బాల్‌, చల్లా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీలుగా ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. కాగా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ ఉండటంతో ప్రతిపక్ష టీడీపీ నుంచి ఎవరు బరిలో నిలువలేదు.
తెలంగాణ రాష్ట్రంలో మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్‌ నేత గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్‌ ఉపసంహరణకు గడువు ముగిసింది. గుత్తా ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేసి ఉండటంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యుల నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి ధ్రువపత్రం అందుకున్నారు.




 


 


Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM