ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌సిగ్నలిచ్చిన ప్రభుత్వం!

by సూర్య | Mon, Jun 24, 2019, 09:27 PM

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని సడలించింది. ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నలిచ్చింది. మంగళవారం నుంచి జులై 5వరకు బదిలీలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఒకేచోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారికి బదిలీకి అవకాశం కల్పించారు. టీచర్లు, లెక్చరర్లు మినహా మిగతా శాఖల్లో మాత్రమే బదిలీలు చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చి 31లోపు రిటైర్ అయ్యేవారి బదిలీలను నిలిపివేశారు.
సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు ఈ ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసి సీఎం సంతకం కోసం పంపిన విషయం తెలిసిందే. సాధారణంగా వేసవి సెలవుల సమయంలో బదిలీలు చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి ఎన్నికలు అడ్డురావడంతో బదిలీల ప్రక్రియకు బ్రేక్‌ పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన దరిమిలా క్షేత్రస్థాయి వరకూ పలువురు అధికారులను బదిలీ చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావించింది.


 

Latest News

 
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM