వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీదే అధికారం!జీవీఎల్

by సూర్య | Sat, Jun 22, 2019, 10:29 PM

వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ అధికార పార్టీగా ఎదిగినా ఆశ్చర్యపోవద్దని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో కూడా రానున్న ఎన్నికల్లో బీజేపీ బలపడి అధిక సీట్లలో గెలుపు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో గతంలో అధికారంలో ఉన్న టీడీపీ అభివృధ్దిపై కాకుండా అవినీతిపై దృష్టి సారించిందని విమర్శించారు. మోదీతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి టీడీపీ నాయకులు బిజెపి లోకి వస్తున్నారని జీవీఎల్ తెలిపారు. బిజెపిలో చేరినా వారిపై వున్న అభియోగాలకు వారు సమాధానం చెప్పాల్సిందేనని ఇటీవల బీజేపీలో చేరిన నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరాడానికి ఇంకా చాలామంది సిధ్ధంగా వున్నారని, ఏమి ఆశించకుండా పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని జీవిఎల్ అన్నారు.
2021-22 నాటికి బీజీపీకి రాజ్యసభలో పూర్తి స్థాయి మెజారిటీ వస్తుందని, మాకు సంఖ్యాబలం అవసరం కాబట్టి ఇతర రాజకీయ పార్టీల వారిని బీజేపీలో చేర్చుకుంటున్నాం అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సభలో అనేక బిల్లులు పాస్ కాకుండా అడ్డుకున్న పార్టీలు మెజారిటీలను కోల్పోయాయని, టీడీపీ కూడా రాజ్యసభ సమావేశం జరగకుండా అడ్డుకుందని ఆయన విమర్శించారు. పన్నెండు కోట్ల రైతు కుటుంబాల కు మాత్రమే వచ్చే ప్రధానమంత్రి కిసాన్ యోజన దేశంలోని రైతులందరికీ అందేలా కేంద్ర నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. డెబ్బై ఏళ్ళలో చేసే అభివృద్ధి మోదీ ఐదు సంవత్సరాలలో చేశారని.. 2024 ఎన్నికల్లో మరింత మెజారిటీతో బిజెపి గెలుపు సాధిస్తుందని అన్నారు.
రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ అనేక అభివృద్ధి పదకాలు అమలు చేస్తున్నారని,  అర్హులైన మూడు కోట్ల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లను కేంద్రం మంజూరు చేసిందని, 14 కోట్ల కుటుంబాలకు మంచినీటిని అందించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. అభివృద్దే ప్రధానంగా బిజెపి పనిచేయటమే విజయానికి కారణమైందని జీవీఎల్ చెప్పుకొచ్చారు.


 

Latest News

 
మరో వారం రోజుల్లో పోలింగ్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు Mon, May 06, 2024, 09:47 PM
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త.. ఇక నో టెన్షన్ Mon, May 06, 2024, 08:54 PM
ఇదంతా ఆ ముగ్గురి కుట్ర, నాలుగేళ్లగా జరుగుతోంది.. అల్లుడు గౌతమ్ వ్యాఖ్యలపై మంత్రి రాంబాబు స్పందన Mon, May 06, 2024, 08:00 PM