అద్దె డ‌బ్బుల కింద చిల్ల‌ర ఇచ్చిన వ్యాపారి!

by సూర్య | Fri, Jun 21, 2019, 09:29 PM

అప్పుడప్పుడు ప్రపంచంలో జరిగే కొన్ని విషయాలు చాలా ఆసక్తికరంగా అనిపిస్తూ ఉంటాయి. కొంతమంది తమకు ఇష్టం లేని వ్యక్తులుపై విచిత్రమైన పద్ధతుల్లో పగ తీర్చుకుంటుంటారు. తాజాగా చైనాలో కూడా అలాంటి ఓ విచిత్రమైన పనిచేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వ్యక్తి హాట్ టాపిక్ గా మారాడు..
చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్ జినాన్ లో వ్యాపారవేత్త అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. అయితే ఆ ఇంటి ఓనర్ తో వ్యాపార వ్యాప్తికి ఏవో గొడవలు వచ్చాయి. దీంతో వెంటనే తన అద్దె చెల్లించాలని ఇంటి ఓనర్ గట్టిగా పట్టు పట్టడం జరిగింది. అయితే ఈ విషయంలో ఓనర్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన వ్యాపారవేత్త అద్దె రూపంలో ఏకంగా 15.17 లక్షలు చిల్లర పైసలు ఇచ్చాడు. ఏకంగా దీనికోసం 20 ప్లాస్టిక్ బకెట్లతో చిల్లర ఓనర్ కి పంపించాడు. ఆ చిల్లర బకెట్లు చూసి ఇంటి యజమాని షాక్ అయ్యాడు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో వాటికి ఇంటికి ఓనర్ తీసుకోక తప్పలేదు. అయితే ఆ చిల్లర ఎంత ఉంది అనే విషయం తెలుసుకోవడానికి ఇంటి ఒంటర చివరికి 24 మంది ఉద్యోగులను రంగంలోకి దించి నాలుగు గంటల పాటు ఆ చిల్లర పైసలు లెక్కించి తీసుకున్నాడు.

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM