ప్రజావేదిక స్వాధీనం పై పంచుమర్తి వ్యాఖ్యలు!

by సూర్య | Fri, Jun 21, 2019, 07:27 PM

ఉండవల్లిలోని ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత పంచుమర్తి అనురాధ. ప్రతిపక్ష నేత విదేశాల్లో ఉన్న సయయంలో ప్రజావేదికను స్వాధీనం చేసుకోవడం అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ పాలిటిక్స్ కు నిదర్శనమన్నారు.   కరకట్ట ప్రాంతంలో ఉన్నవన్నీ అక్రమ కట్టడాలే అంటూ పదేపదే ఆరోపణలు చేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజావేదికను ఎలా స్వాధీనం చేసుకుంటారంటూ నిలదీశారు. ఇదంతా తమను ఇబ్బంది పెట్టడంలో భాగమేనంటూ ఆమె విరుచుకుపడ్డారు. మరోవైపు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ టీడీపీ రాజ్యసభ సభ్యులపై మండిపడ్డారు. పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్ ఉండగా, పార్టీ మారిన రాజ్యసభ సభ్యులు టీడీపీ లెటర్ హెడ్ తో లేఖను ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు. ఒక పార్టీని మరోపార్టీలో విలీనం చేసే ప్రక్రియ అంతా ఈసీ పరిధిలో ఉంటుందన్నారు. అలాంటిది టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీ రాజ్యసభ సభ్యులుగా ఎలా చూపిస్తారంటూ ప్రశ్నించారు పంచుమర్తి అనురాధ.  


 

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM