రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలుపై దృష్టి పెట్టిన ప్రభుత్వం,మహిళల రక్షణను గాలి కొదిలేసింది

by సూర్య | Thu, Oct 24, 2024, 09:05 PM

‘రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు బతికే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 77 మందిపై అత్యాచారాలు జరిగాయి. వీరిలో ఏడుగురు హత్యకు గురి కాగా, ఐదుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలుపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. మహిళల రక్షణను గాలి కొదిలేసింది. మనవాడైతే పర్వాలేదు.. ఏం చేసినా చెల్లుబాటవుతుందనే ధోరణి వల్ల తెలుగుదేశం పార్టీ నేతల అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికైనా మేలుకొని జరిగిన ప్రతి ఘటనకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని వైయ‌స్ఆర్‌సీపీ  అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.


దారుణంగా లైంగిక వేధింపులకు గురై, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సహానా కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. ఆస్పత్రిలోని మార్చురీకి వెళ్లి సహానా మృతదేహానికి నివాళి అర్పించారు. ఘటన జరిగిన తీరు, వైద్యం.. తదితర వివరాలను ఆమె కుటుంబ సభ్యులను, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సహానా కుటుంబ సభ్యులకు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. వైయ‌స్ఆర్‌సీపీ నుంచి ‘హత్యా’చార బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఆర్థిక సాయం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు. 

Latest News

 
శ్రీ జనార్ధన స్వామివారి దేవాలయంలో రమా ఏకాదశి పూజలు Mon, Oct 28, 2024, 01:35 PM
కక్షపూరితంగా దళితులపైన దాడులా..? Mon, Oct 28, 2024, 01:25 PM
జగన్‌ను నేరుగా ఎదుర్కోలేక షర్మిలని చంద్రబాబు ప్రయోగిస్తున్నారు Mon, Oct 28, 2024, 01:23 PM
జగన్ పై మహిళల్లో వ్యతిరేకత పెంచేలా చంద్రబాబు, షర్మిల కుట్రపన్నారు Mon, Oct 28, 2024, 01:21 PM
విద్యుత్తు ఛార్జీల భారం ప్రజలపై వేయడం భావ్యమేనా చంద్రబాబూ? Mon, Oct 28, 2024, 01:19 PM