రూ.12 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించిన కాంగ్రెస్ నాయకురాలు

by సూర్య | Thu, Oct 24, 2024, 06:24 PM

కేరళలోని వయనాడ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ప్రియాంక గాంధీ తన ఆస్తులను రూ.12 కోట్లుగా ప్రకటించారు. తల్లి సోనియా గాంధీ, సోదరుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కలిసి వచ్చిన ప్రియాంక నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలను వెల్లడించారు.తనకు ఉన్న రూ.12 కోట్ల విలువైన ఆస్తిలో రూ.4.24 కోట్ల విలువ చేసే చరాస్తులు, రూ.7.74 కోట్ల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నట్లుగా ప్రకటించారు. మూడు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. తన భర్త రాబర్ట్ వాద్రా బహుమతిగా ఇచ్చిన హోడా సీఆర్వీ కారు, రూ.1.15 కోట్ల విలువైన 4 కిలోలకు పైగా బంగారు నగలు ఉన్నట్లు పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని మోహ్రాలీ ప్రాంతంలో వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమి, ఫామ్ హౌస్‌లో సగం వాటా ఉన్నట్లు వెల్లడించారు. సిమ్లాలో తన పేరిట రూ.5.63 కోట్ల విలువైన ఓ నివాస భవనం ఉందన్నారు.గత ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయం రూ.46.39 లక్షలుగా ఉందని పేర్కొన్నారు. భర్త రాబర్ట్ వాద్రా నికర ఆస్తులు రూ.65.54 కోట్లుగా ప్రియాంక గాంధీ వెల్లడించారు. ఇందులో రూ.37.9 కోట్ల చరాస్తులు, రూ.27.64 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు

Latest News

 
పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు.. సరస్వతి పవర్ భూముల్లో సర్వే Sat, Oct 26, 2024, 11:48 PM
నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల భర్తీ Sat, Oct 26, 2024, 11:48 PM
ఆగిపోయిన ఆర్టీసీ బస్సు.. టాలెంట్ చూపెట్టిన డ్రైవరన్న Sat, Oct 26, 2024, 11:46 PM
ప్రేమ పెళ్లి చేసుకున్న జంటకు పోలీసుల ట్విస్ట్ Sat, Oct 26, 2024, 10:16 PM
తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. స్వయంగా రంగంలోకి దిగిన ఈవో Sat, Oct 26, 2024, 10:14 PM