స్వల్ప నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

by సూర్య | Thu, Oct 24, 2024, 06:18 PM

భారత స్టాక్ మార్కెట్ ఈరోజు ఫ్లాట్‌గా ముగిసింది. వరుసగా నాలుగో రోజు సూచీలు నష్టపోయినప్పటికీ... ఈరోజు అతి స్వల్పంగా పడిపోయాయి. నిన్న సూచీలు భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో వరుస నష్టాలతో ట్రేడ్ అవుతున్న సూచీలు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి.నిఫ్టీ ఎఫ్ఎంసీజీ టాప్ లూజర్‌గా నిలిచింది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 2 శాతానికి పైగా క్షీణించింది. సెన్సెక్స్ 16.82 పాయింట్లు నష్టపోయి 80,065 వద్ద... నిఫ్టీ 36 పాయింట్లు క్షీణించి 24,399 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.07 వద్ద ఉంది. అల్ట్రా టెక్ సిమెంట్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదానీ పోర్ట్స్ స్టాక్స్ లాభాల్లో ముగియగా... హిందూస్థాన్ యూనీలీవర్, నెస్లే ఇండియా, ఐటీసీ, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టపోయాయి

Latest News

 
ఏపీలో పింఛన్‌లపై మరో శుభవార్త.. ఇకపై చాలా ఈజీగా, ఆరంచెల విధానం రద్దు Sat, Oct 26, 2024, 09:29 PM
ఆ తండ్రిని చూసి నా కళ్లలో నీళ్లొచ్చాయి.. ఆ రెండు వంటలు బాగా చేస్తా: అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు Sat, Oct 26, 2024, 09:27 PM
బయటకు వచ్చిన మరో లెటర్.. చెల్లెలు షర్మిలకు జగన్ భావోద్వేగ లేఖ Sat, Oct 26, 2024, 09:26 PM
కార్యకర్తల సంక్షేమమే టీడీపీ లక్ష్యం: ఎమ్మెల్యే కోండ్రు Sat, Oct 26, 2024, 08:57 PM
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Sat, Oct 26, 2024, 08:40 PM