ట్రాఫిక్‌ సమస్యపై దృష్టి సారిస్తున్నాం

by సూర్య | Wed, Oct 23, 2024, 08:14 PM

విజయవాడ ట్రాఫిక్‌ సమస్యకు ఫ్లైవోవర్లు, బైపాస్‌ రోడ్డుల నిర్మాణంతోనే పరిష్కారం లభిస్తుంది అని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. మహానాడు జంక్షన్‌ నుంచి నిడమనూరు రైల్వే బ్రిడ్జి వరకు 6.5 కిలోమీటర్ల మేర నిర్మించే ఫ్లైవోవర్‌ డీపీఆర్‌ సిద్ధం చేశాం. దీనికి రామవరప్పాడు వద్ద ఇన్‌ అండ్‌ ఔట్‌ ఎగ్జిట్‌ ఇస్తున్నారు. ఫ్లైవోవర్‌ డిజైన్లు కూడా రెడీ అయ్యాయి. టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి 2025 ఫిబ్రవరి నుంచి పనులు ప్రారంభిస్తాం. రెండేళ్లలో ఫ్లైవోవర్‌ను పూర్తి చేస్తాం. విజయవాడ తూర్పు బైపాస్‌ రోడ్డుకు కూడా డీపీఆర్‌ పూర్తయింది. అలైన్‌మెంట్‌ డిజైన్‌ కూడా ఫైనల్‌ చేశాం.


టెండర్లు పూర్తి చేసి 2025 మార్చికి పనులు ప్రారంభిస్తాం. రాజధాని అమరావతి తొలి దశ పనులు పూర్తయ్యే నాటికి తూర్పు బైపాస్‌ కూడా పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం. మొత్తం మీద రెండేళ్లలో అటు ఫ్లైవోవర్‌ ఇటు తూర్పు బైపాస్‌ రెండూ పూర్తవుతాయి. ఇప్పటికే పశ్చిమ బైపాస్‌ పూర్తయ్యింది. మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి వస్తుంది. బెంజి సర్కిల్‌ నుంచి ఎన్టీఆర్‌ సర్కిల్‌ మీదుగా బందరు రోడ్డు విస్తరణ పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. ఇవన్నీ పూర్తయితే విజయవాడ ట్రాఫిక్‌ సమస్యలకు పూర్తి స్థాయి పరిష్కారం లభిస్తుంది అని అభిప్రాయపడ్డారు.

Latest News

 
శ్రీనివాసుని సన్నిధిలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దంపతులు Fri, Oct 25, 2024, 11:46 AM
బాధిత కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత Fri, Oct 25, 2024, 11:40 AM
అన్నమయ్య జిల్లాలో దారుణం ..గ‌ర్భం దాల్చిన 16 ఏళ్ల బాలిక‌ Fri, Oct 25, 2024, 11:21 AM
లోకేష్‌ని విమర్శించే స్థాయి జగన్‌కు లేదు Thu, Oct 24, 2024, 09:47 PM
జగన్ పాలనలో అమరావతి రైతులు ఎన్నో బాధలు పడ్డారు Thu, Oct 24, 2024, 09:46 PM