యువతకు ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది

by సూర్య | Wed, Oct 23, 2024, 08:02 PM

రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించే దిశగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు అని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఎంఎస్‌ఎంఈ(మైక్రో, మీడియం, స్మాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌)పాలసీపై దృష్టి పెట్టాం. ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ను, నియోజకవర్గానికి ఓ ఇండస్ట్రియల్‌ పార్కును ఏర్పాటు చేయాలన్నది చంద్రబాబు లక్ష్యం.


అందులో భాగంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో ఏడు ఇండస్ట్రియల్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈలపై యువతకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 29 నుంచి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ నగరంలో పేద, మధ్యతరగతి యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్తాను. ప్రతియేటా నా పార్లమెంటు పరిధిలో 10వేల మంది యువతకు ఉపాధి కల్పించాలన్నది నా లక్ష్యం అని అన్నారు.

Latest News

 
పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు.. సరస్వతి పవర్ భూముల్లో సర్వే Sat, Oct 26, 2024, 11:48 PM
నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల భర్తీ Sat, Oct 26, 2024, 11:48 PM
ఆగిపోయిన ఆర్టీసీ బస్సు.. టాలెంట్ చూపెట్టిన డ్రైవరన్న Sat, Oct 26, 2024, 11:46 PM
ప్రేమ పెళ్లి చేసుకున్న జంటకు పోలీసుల ట్విస్ట్ Sat, Oct 26, 2024, 10:16 PM
తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. స్వయంగా రంగంలోకి దిగిన ఈవో Sat, Oct 26, 2024, 10:14 PM