మాకు జీతాలు చెల్లించండి

by సూర్య | Wed, Oct 23, 2024, 08:01 PM

వైద్య, ఆరోగ్య శాఖలో ఏడాది కిందట చేరిన పలువురికి ఇప్పటికీ జీతాలు చెల్లించడం లేదు. వేతనాలను చెల్లించాలంటూ ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం కనిపించడం లేదని వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే...ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వివిధ కేడర్లకు చెందిన 14 మంది సిబ్బంది ఉండాలని గత వైసీపీ ప్రభుత్వం నిర్దేశించింది. అందుకు అనుగుణంగా 2022లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్‌ ప్రకారం చివరి కేడర్‌ అయిన క్లాస్‌-4 ఉద్యోగులుగా ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎఫ్‌ఎన్‌వో, ఎంఎన్‌వో, ఎస్‌ఏడబ్ల్యు (శానిటరీ అటెండర్‌ కమ్‌ వాచ్‌మెన్‌)గా 54 మంది చేరారు.


ఈ ఎంపిక ప్రక్రియ జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో సాగింది. పదో తరగతి మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం భర్తీచేశారు. గత ఏడాది సెప్టెంబరులో వీరంతా విధుల్లో చేరారు. పదమూడు నెలలు పూర్తయింది. అయితే, ఇప్పటివరకూ సదరు ఉద్యోగులకు ఒక్క నెల వేతనం కూడా అందలేదు. ఈ సమస్యపై అప్పట్లో మంత్రులు, ఉన్నతాధికారులను కలిశారు. ఫైల్‌ ఆరోగ్యశాఖ వద్ద ఉందని కొన్నాళ్లు, కలెక్టరేట్‌లో పెండింగ్‌లో ఉందని మరికొన్నాళ్లు చెబుతూ వచ్చారు. ఈలోగా ఎన్నికలు వచ్చాయి. డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ నోటిఫికేషన్‌ ప్రకారం జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఎఫ్‌ఎన్‌వో, ఎంఎన్‌వో, ఎస్‌ఏడబ్ల్యుల నియామక ప్రక్రియ సాగింది. వీరిని ఆరోగ్య శాఖకు అటాచ్‌ చేసి ఉంటే జీతాలు అక్కడి నుంచి చెల్లించేవారు. కానీ, వైసీపీ ప్రభుత్వం వీరిని ఆంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌సోర్స్‌డ్‌ సర్వీసెస్‌లో చేర్చింది. దీంతో వారి జీతాలు ఆ కార్పొరేషన్‌ నుంచి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జీతాలను చెల్లించలేదు. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ కార్పొరేషన్‌ను పూర్తిగా క్లోజ్‌ చేసింది. దాంతో తమ పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని వారంతా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రెండు వారాల కిందట కలెక్టర్‌ను కలిశారు. ఇటీవల మంగళగిరిలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను కలిసి తమ ఇబ్బందులను వివరించారు. ఆయన సానుకూలంగా స్పందించారని, ప్రిన్సిపల్‌ సెక్రటరీతో మాట్లాడి జీతాలు చెల్లించేలా చూస్తామని హామీ ఇచ్చారని లక్ష్మణ్‌ అనే ఉద్యోగి వెల్లడించారు.

Latest News

 
గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 40 వరకు అక్రమ లేఅవుట్లు Sun, Oct 27, 2024, 03:21 PM
రెండు నగరాల మధ్య కనెక్టివిటీ పెంచాలని విజ్ఞప్తులు వచ్చాయన్న రామ్మోహన్ Sun, Oct 27, 2024, 03:19 PM
షర్మిల రాజకీయంగా ఒంటరయ్యారు: భూమన Sun, Oct 27, 2024, 03:12 PM
నాగర్జునకొండను సందర్శించిన పర్యాటకులు Sun, Oct 27, 2024, 02:38 PM
ఏపీ రైతులకు శుభవార్త! Sun, Oct 27, 2024, 02:37 PM