రైల్వే అప్ డేట్స్

by సూర్య | Wed, Oct 23, 2024, 07:56 PM

దానా తుఫాను కారణంగా అనంతపురం మీదుగా వేళ్లే బెంగళూరు-హౌరా-బెంగళూరు అప్‌ అండ్‌ డౌన్‌ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బెంగళూరు-భువనేశ్వర్‌ (రైలు నం. 18464)ను ఈ నెల 23న, దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం. 18463)ను 24న రద్దు పరచినట్లు తెలియజేశారు. జిల్లాలోని రాయదుర్గం-కదిరిదేవరపల్లి రైల్వే సెక్షన్‌లో జరుగుతున్న యార్డు ఆధునికీకరణ పనుల కారణంగా తిరుపతి ప్యాసింజరును పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.


తిరుపతి-కదిరిదేవరపల్లి ప్యాసింజరు (నం. 07589) రైలును నవంబరు 1 నుంచి 30 వరకూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 07590)ను నవంబరు 2 నుంచి డిసెంబరు 1 వరకూ గుంతకల్లు-కదిరిదేవరపల్లి సెక్షన్‌లో పాక్షికంగా రద్దుపరచి, గుంతకల్లు-తిరుపతి సెక్షన్‌లో నడపనున్నట్లు వివరించారు. అలాగే రైల్వే మెయింటెనెన్స్‌ వర్కుల కారణంగా గుత్తి మీదుగా వెళ్లే కాచిగూడ-తిరుపతి (నం. 07063) ప్రత్యేక రైలును ఈ నెల 29, నవంబరు 5, 12 తేదీల్లోనూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 07064)ను ఈ నెల 30న, నవంబరు 6, 13 తేదీల్లోనూ రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

Latest News

 
శుభ ఘడియలు వచ్చేశాయ్‌.. రెండు నెలల్లో 18 ముహుర్తాలు Mon, Oct 28, 2024, 11:34 AM
పులివెందుల: సమస్యల పరిష్కారానికి పోరాడుదాం Mon, Oct 28, 2024, 10:22 AM
నవంబర్ 6న ఏపీ కేబినెట్ భేటీ.. ఈసారి వీటిపైనా ప్రధానంగా చర్చ Sun, Oct 27, 2024, 11:32 PM
తెలంగాణ నుంచి వచ్చిన ఐఏఎస్‌లకు పోస్టింగ్.. ఆమ్రపాలికి ఏ పోస్ట్ అంటే Sun, Oct 27, 2024, 11:31 PM
పవన్ కళ్యాణ్‌ను కలిసిన తమిళ డైరెక్టర్.. కార్యాలయానికి వెళ్లి మరీ Sun, Oct 27, 2024, 11:28 PM