ఈ ఘటనపై ప్రభుత్వం ధర్మం పాటించాలి

by సూర్య | Wed, Oct 23, 2024, 07:54 PM

 ఏపీలో లా అండ్ ఆర్డ్‌ర్‌పై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్పీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జీజీహెచ్‌లో బ్రెయిన్ డెడ్ అయిన సహానా కుటుంబసభ్యులను జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందన్నారు. ఒక దళిత చెల్లి బలై పోయిందని విమర్శించారు. వైసీపీ పాలనలో మహిళలకు భరోసా ఇచ్చామని.. దిశ యాప్ అందుబాటులోకి తెచ్చామని చెప్పుకొచ్చారు.


ఎస్‌ఓఎస్ బటన్ నొక్కిన వెంటనే పోలీసులను పంపించే వాళ్ళమన్నారు. చేసిన వాడు మన వాడైతే ఏం చే‌సినా పర్వాలేదు అన్న సంకేతాలు పంపుతున్నారని విమర్శించారు. గుంటూరులో దయనీయమైన ఘటన జరిగిందని... ప్రభుత్వం ఏ విధంగా స్పందించిందో చూశామన్నారు. సీఎం చంద్రబాబుతో నిందితుడు దిగిన ఫోటోలు ఉన్నాయన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం ధర్మం పాటించాలన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత బాధితురాలిని ఆసుపత్రిలో చేర్చారని.. ప్రభుత్వం నుంచి ఎవరూ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కేవలం టీడీపీకి చెందిన యువకుడు కావడంతోనే ప్రభుత్వం స్పందించ లేదని విమర్శించారు.

Latest News

 
పెళ్లి పేరుతో వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్య Mon, Oct 28, 2024, 03:38 PM
జగన్‌పై వైఎస్ షర్మిల చెప్పినవన్నీ నిజాలే Mon, Oct 28, 2024, 03:11 PM
అధికారం కోసమే షర్మిల తాపత్రయం Mon, Oct 28, 2024, 03:11 PM
జగన్ చేయి పట్టుకున్నోళ్లంతా పాతాళంలోకే Mon, Oct 28, 2024, 03:10 PM
తిరుపతిలో బాంబుల బెదిరింపులు Mon, Oct 28, 2024, 03:09 PM