జగనన్న కాలనీలపై విచారణ చేపట్టాలి

by సూర్య | Fri, Jul 26, 2024, 11:50 PM

జగనన్న కాలనీ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని నర్సాపురం యువజన సంఘం ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం పోలాకి స్థానిక సచివాలయం వద్ద సంబంధిత అధికారు లను నిలదీశారు. అక్రమాల పై గతంలో అనేక పర్యాయాలు ఫిర్యాదు లు చేసినా అధికారులు పట్టించు కోలేదని ఆరోపించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ఎవరూ లేకపోవడం తో సచివాలయానికి వెళ్లి వీఆర్వో శ్రీనివాసరావును కలిసి సమస్యలను విన్నవించామని యువజననాయకులు శ్యామలరావు, పి.రామకృష్ణ, వెంకటి తెలిపారు. నర్సాపురంలో ఇచ్చిన జగనన్న కాలనీలో రికార్డుల్లో లేకుండా ఆరుగురు వ్యక్తులు కాలనీ ఇళ్లు ఎలా నిర్మిం చారని, ఎవరి ప్రోద్బలంతో చేపట్టారని ప్రశ్నించారు. రెవెన్యూ కార్యా లయంలో కాలనీ సమస్య ను ఎవరూ పట్టంచుకోవడంలేదని సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని వారు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా అక్రమంగా ఇళ్లు నిర్మించిన పునాదుల వద్ద బాధితులు, యువకులు నిరసన వ్యక్తంచేశారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM