సకల సౌకర్యాల కొత్త ఇంట్లో అడుగుపెట్టనున్న రాహుల్ గాంధీ

by సూర్య | Fri, Jul 26, 2024, 10:56 PM

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ కొత్త ఇంటికి మారనున్నారు. రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వం కొత్త నివాసాన్ని కేటాయించింది. హైక్లాస్ సౌకర్యాలు ఉన్న ఆ బంగ్లాను రాహుల్ గాంధీకి లోక్‌సభ హౌస్ కమిటీ ఆఫర్ చేసింది. ఢిల్లీలోని సునేహ్రి బాగ్ రోడ్‌లో ఉన్న బంగ్లా నెంబర్‌ 5 ను లోక్‌సభ హౌస్‌ కమిటీ రాహుల్ గాంధీకి కేటాయించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక ఆ ఇంటిని ఆయన సోదరి ప్రియాంకా గాంధీ ఈ బంగ్లాను చూసేందుకు రావడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. అయితే ఇప్పటివరకు ఆ బంగ్లాలో ఉంటానని రాహుల్ గాంధీ స్పష్టం చేయలేదు. దీంతో ఈ విషయంపై సందిగ్ధం కొనసాగుతోంది.


ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఎంపీగా రెండు చోట్ల విజయం సాధించారు. గతంలో గెలిచిన కేరళలోని వయనాడ్‌తోపాటు.. తన తల్లి నియోజకవర్గం అయిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి ఎన్నికయ్యారు. అయితే వయనాడ్ స్థానాన్ని వదులుకుని.. రాయ్‌బరేలీ స్థానంలోనే తాను ఎంపీగా కొనసాగుతానని ఇప్పటికే రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆ తర్వాత ఇటీవల రాహుల్ గాంధీని లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా.. ఇండియా కూటమి నేతలు ఎన్నుకున్నారు. ఇక లోక్‌సభలో ప్రతిపక్ష నేత అంటే అది క్యాబినెట్ ర్యాంకు హోదాతో సమానం. దీంతో రాహుల్ గాంధీకి లోక్‌సభ హౌస్ కమిటీ టైప్ 8 బంగ్లాను కేటాయించింది. ఈ టైప్ 8 బంగ్లాను కేవలం క్యాబినెట్ మంత్రులు, సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు జడ్జీలు, సహాయ మంత్రులు, కేంద్ర ప్రభుత్వంలోని కీలక కార్యదర్శులకు కేటాయిస్తారు.


  అయితే గతేడాది మోదీపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడి లోక్‌సభలో అనర్హత వేటు పడటంతో రాహుల్ గాంధీ అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు రాహుల్ గాంధీ అనర్హతపై స్టే విధించింది. దీంతో అప్పటినుంచి 10 జనపథ్‌లోని తన తల్లి సోనియా గాంధీ నివాసంలోనే రాహుల్‌ గాంధీ ఉంటున్నారు. అయితే తుగ్లక్ లేన్ 12 లో ఉన్న ఆ అధికార నివాసంలో 2004 నుంచి ఏప్రిల్ 2023 వరకు రాహుల్ గాంధీ అక్కడే ఉన్నారు.


అయితే పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ఆయన ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన లోక్‌సభ సెక్రటేరియట్.. తుగ్లక్ లేన్‌లోని అదే బంగ్లాను మళ్లీ రాహుల్ గాంధీకి కేటాయించింది. కానీ నా ఇల్లు భారతదేశం అని వ్యాఖ్యానించిన రాహుల్ గాంధీ.. ఆ ఇంట్లోకి మారకుండా తన తల్లి వద్దే ఉంటున్నారు.

Latest News

 
జస్ట్ 40 రోజుల్లోనే ఆ..రు..సార్లు స్నానం చేశాడు.. అయినా విడాకులు కోరితే ఎలా..? Mon, Sep 16, 2024, 10:47 PM
అమరావతి రైతులకు,,,కౌలు డబ్బులు విడుదల చేసిన ప్రభుత్వం Mon, Sep 16, 2024, 10:10 PM
వరదబాధితులకు టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లు ఉచితంగా,,,,టీడీపీ నేత గొప్ప మనసు.. Mon, Sep 16, 2024, 10:06 PM
చంద్రబాబు, లోకేశ్ లపై జగన్ విమర్శనాస్త్రాలు Mon, Sep 16, 2024, 09:54 PM
ఆపరేషన్ ప్రకాశం బ్యారేజీ.. ప్లాన్ 5 అయినా సక్సెస్ అవుతుందా Mon, Sep 16, 2024, 09:52 PM