ఏపీలో తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లా లకు ఈసీ ప్రకటన

by సూర్య | Fri, Jul 26, 2024, 10:34 PM

 తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి తాజా ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది.2024 నవంబరు 1 నాటికి జాబితా రూపోందించేలా షెడ్యూలు విడుదల చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈ నెల 29న ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల రిజిస్ట్రేషన్‌కు ఈసీ.. నోటీసు విడుదల చేయనుంది.శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ ఉపాధ్యాయ నియోజకవర్గానికి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు 2024 సెప్టెంబరు 30న ఎన్నికల సంఘం నోటీసు జారీ చేయనుంది. 2024 డిసెంబరు 30 నాటికి తుది ఓటర్ల జాబితా రూపొందిస్తామని సీఈవో కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఎమ్మెల్సీలు ఇళ్ల వెంకటేశ్వరరావు, కేఎస్ లక్ష్మణ రావు, పాకలపాటి రఘువర్మ పదవీకాలం 2025 మార్చి 29తో పూర్తి అవుతుందని ఈసీ ప్రకటనలో వెల్లడించింది.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM