ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలి

by సూర్య | Thu, Jul 25, 2024, 11:31 PM

ఢిల్లీలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో త‌ల‌పెట్టిన‌ నిరసన కార్యక్రమానికి దేశ‌వ్యాప్తంగా ఉన్న పార్టీలు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. ఈ సందర్భంగా పాల్గొన్న  వీసీకే పార్టీ అధ్యక్షుడు (తమిళనాడు) తిరుమా వలవన్‌ మాట్లాడుతూ....  న్యాయం కోసం మీరు చేస్తున్న ఈ పోరాటానికి మద్దతు ఇచ్చేందుకు మేము ఇక్కడికి వచ్చాము. రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలపై ఫోటోలు, వీడియోల క్లిప్పింగ్స్‌ అన్నీ చూశాము. నిజంగా షాక్‌కు గురయ్యాము. ఎన్నికలు జరిగిన నెల రోజుల్లోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా, అధికార టీడీపీ అనేక దౌర్జన్యాలు చేసింది. వారి ఇళ్లపైన పడిన టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారు. ఆస్తులు ధ్వంసం చేశారు. ఇదేదో యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు. పక్కాగా ప్లాన్‌ చేసి మరీ ఈ దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన టాప్‌ లీడర్ల ఆదేశాల మేరకే, ఆ పార్టీ కార్యకర్తలు ఈ దాడులు, దౌర్జన్యాలు చేశారు. ముఖ్యంగా ప్రస్తుత సీఎం కొడుకు, తన పార్టీ కేడర్‌ను ఈ దాడులకు ఉసి గొల్పుతున్నాడు. మా పార్టీ తరపున ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏపీలో జరుగుతున్న అరాచకాలను కేంద్రం కూడా పరోక్షంగా సమర్థిస్తోంది. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలి. ఏపీలో శాంతి భద్రతలు కాపాడాలి. మా పార్టీ తరపున వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. జగన్‌గారికి అండగా నిలుస్తాం. ఏపీలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలకు రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేయాలి. సంబంధిత నాయకులపై కేసులు నమోదు చేయాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ దిశలో తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేం డిమాండ్‌ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ కల్పించాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొనేలా చూడాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ఘటనలకు చోటు లేదు. అందుకే దీన్ని ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు కూడా ఖండించాలి.  మేమ తప్పనిసరిగా మీకు అండగా నిలుస్తాము. న్యాయం కోసం మీరు చేస్తున్న పోరాటంలో మీకు మద్దతునిస్తామని హామీ ఇస్తున్నాను అని తెలిపారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM