by సూర్య | Thu, Jul 11, 2024, 05:08 PM
సమయపాలన పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని సచివాలయ ఉద్యోగులను పెడన మునిసిపల్ కమిషనర్ బి.వెంకట్రామయ్య హెచ్చరించారు. బుధవారం ఉదయం పట్టణంలోని 1వ సచివాలయానికి 10.30 గంటలకు తనిఖీకి వెళ్లారు. ఆ సమయంలో ముగ్గురు ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. మిగిలిన ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. దీంతో సిబ్బందిపై కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలోని రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు.
Latest News