41 ఏళ్ల తర్వాత ఆస్ట్రియా గడ్డపై భారత ప్రధాని.. సెల్ఫీ షేర్ చేసిన మోదీ

by సూర్య | Wed, Jul 10, 2024, 09:53 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రియా పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే 41 ఏళ్ల తర్వాత తొలిసారి ఆస్ట్రియా గడ్డపై అడుగుపెట్టిన భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రికార్డుల్లోకి ఎక్కారు. మంగళవారం సాయంత్రం మాస్కో నుంచి బయల్దేరిన నరేంద్ర మోదీ.. వియన్నాలో దిగారు. ఈ క్రమంలోనే వియన్నా ఎయిర్‌పోర్ట్‌లో నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్‌ స్కాల్లెన్‌ బర్గ్‌తోపాటు ఇతర అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతించారు. ఈ క్రమంలోనే కొన్ని ఫోటోలను ట్విటర్ వేదికగా మోదీ పంచుకున్నారు. వియన్నాలో అడుగు పెట్టిన తనకు అద్భుతమైన స్వాగత ఏర్పాట్లు చేసినందుకు ఆస్ట్రియా ఛాన్సలర్‌ కార్ల్‌ నెమహ్మర్‌కు ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా కార్ల్‌ నెమహ్మర్‌తో దిగిన ఫొటోలను షేర్ చేశారు. మంగళవారం రాత్రి మోదీకి.. కార్ల్‌ ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. ఆస్ట్రియాతో భారత్‌కు దృఢమైన బంధం ఉందని.. ఆ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ వాన్‌డర్‌ బెల్లెన్‌, ఛాన్స్‌లర్‌ కార్ల్‌ నెమహ్మర్‌తో భేటీ కానున్నట్లు తెలిపారు. అయితే చివరగా.. 1983లో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ఆస్ట్రియాలో పర్యటించారు.

Latest News

 
కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:45 PM
ఏపీలో పశువులున్న రైతులకు అలర్ట్.. వెంటనే ఇలా చేయండి Fri, Oct 25, 2024, 10:40 PM
ఉచిత ఇసుకపై కీలక నిర్ణయం.. జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం Fri, Oct 25, 2024, 10:35 PM
ఆంధ్రప్రదేశ్‌కు హడ్కో మరో తీపికబురు.. ఇక వెలుగులే Fri, Oct 25, 2024, 10:31 PM
పర్యాటకులకు బంపరాఫర్.. రేపటి నుంచే ఆధ్యాత్మిక యాత్ర.. వన్డే టూర్ కోసం గెట్ రెడీ Fri, Oct 25, 2024, 10:27 PM