ధర్మవరం వాసులకు శుభవార్త.. చెన్నైకి బస్సు సర్వీస్.. ప్రారంభించిన మంత్రి

by సూర్య | Wed, Jul 10, 2024, 08:11 PM

ధర్మవరం నుంచి చెన్నైకు నూతన బస్సు సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బుధవారం ఈ సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ప్రారంభించారు. ధర్మవరం పట్టుచీరలకు ప్రసిద్ధి కాగా.. ఎంతో మంది వ్యాపారులు, వ్యాపార నిమిత్తం ఇక్కడి నుంచి చెన్నైకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ధర్మవరం వాసుల కోసం ధర్మవరం నుంచి చెన్నైకు ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును తీసుకువచ్చింది. ఈ బస్సు పుట్టపర్తి, కదిరి, మదనపల్లె, తిరుపతి మీదుగా చెన్నైకు వెళ్తుంది. ధర్మవరం నుంచి చెన్నై వెళ్లే వ్యాపారస్థులకు, కార్గో సర్వీసులకు ఈ బస్సు సర్వీసు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు. అలాగే తిరుపతి, చెన్నైలో చదువుకునేవాళ్లకు, ఉద్యోగం చేసుకునేవాళ్లకూ ఉపయోగపడుతుందని చెప్పారు. మరోవైపు తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునేలా లింకప్‌నూ ఈ బస్సు ద్వారా ఆర్టీసీ వాళ్లు కల్పించారు.

Latest News

 
కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:45 PM
ఏపీలో పశువులున్న రైతులకు అలర్ట్.. వెంటనే ఇలా చేయండి Fri, Oct 25, 2024, 10:40 PM
ఉచిత ఇసుకపై కీలక నిర్ణయం.. జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం Fri, Oct 25, 2024, 10:35 PM
ఆంధ్రప్రదేశ్‌కు హడ్కో మరో తీపికబురు.. ఇక వెలుగులే Fri, Oct 25, 2024, 10:31 PM
పర్యాటకులకు బంపరాఫర్.. రేపటి నుంచే ఆధ్యాత్మిక యాత్ర.. వన్డే టూర్ కోసం గెట్ రెడీ Fri, Oct 25, 2024, 10:27 PM