శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే

by సూర్య | Fri, Apr 26, 2024, 08:38 PM

ప్రముఖ జ్యోతిర్లంగ క్షేత్రం శ్రీశైలంలో లోకళ్యాణార్ధం శ్రీభ్రమరాంబికా అమ్మవారికి కుంభోత్సవం నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలో తొలి విడత సాత్వికబలిగా కొబ్బరి, నిమ్మ, గుమ్మడికాయలు సమర్పించారు. సాయంత్రం శ్రీస్వామివారికి అన్నాభిషేకం జరుగుతుంది. అమ్మవారి ఆలయ సింహ మండపం వద్ద అన్నాన్ని రాశిగా పోసి.. ప్రదోశకాల పూజల అనంతరం మల్లికార్జున స్వామికి అన్నాభిషేకం చేస్తారు. ఆలయ ద్వారాలు మూసివేసిన అనంతరం ఆలయ ఉద్యోగి స్త్రీ వేషధారణలో భ్రమరాంబాదేవికి కుంభహారతి సమర్పించనున్నారు. తర్వాత నవకాయ పిండివంటలతో మహానివేదన సమర్పిస్తారు.


 సాయంత్రం రెండో విడత సింహ మండపం వద్ద కొబ్బరికాయలు, గుమ్మడికాయలను సాత్విక బలిగా సమర్పిస్తారు. కుంభహారతి సమయంలో భ్రమరాంబాదేవికి అధిక పరిమాణంలో పసుపు, కుంకుమలను సమర్పించి శాంతి ప్రక్రియను నిర్వహించనున్నారు. ఉత్సవం ముగిసిన తర్వాత భక్తులను అమ్మవారి భ్రమరాంబికా దేవి నిజరూప దర్శనానికి అనుమతి ఇస్తారు. శ్రీశైల మహాక్షేత్రంలో నిర్వహించే కుంభోత్సవం క్షేత్ర రక్షణ కోసం ఏటా ఛైత్రమాసంలో పౌర్ణమి తర్వాత నిర్వహిస్తారు. ఇక, కుంభోత్సవం నేపథ్యంలో అమ్మవారి ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను, స్వామివారి కళ్యాణోత్సవం, ఏకాంత సేవలను రద్దుచేశారు.


శ్రీశైలం క్షేత్రంలో జీవహింస నిషిద్ధం కారణంగా జంతు, పక్షు బలులు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆలయ మాడవీధులు, అంకాళమ్మ, పంచమఠాలు, మహిషాసురమర్ధిని ఆలయాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సుండిపెంటలో మద్యం దుకాణాలు నిలిపివేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. జంతుబలి నిషేధంపై భక్తుల్లో అవగాహన కల్పించడానికి టెంపుల్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. క్షేత్ర పరిధిలో పక్షి, జంతు బలి నిషేధం గురించి పలు చోట్ల బోర్డులు ఏర్పాటు చేశారు. కుంభోత్సవం సందర్భంగా అమ్మవారి దర్శనాల కోసం భక్తులు రద్దీ వల్ల క్యూ లైన్లలో తొక్కిసలాట లేకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. క్యూ లైన్ల నిర్వహణకు కూడా సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు.

Latest News

 
కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి Wed, May 08, 2024, 01:22 PM
ప్రశాంత ఎన్నికలకి సహకరించండి Wed, May 08, 2024, 01:21 PM
యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం మా ద్యేయం Wed, May 08, 2024, 01:21 PM
ప్రతి ఒక్కరు ఎన్నికల నిబంధనలు పాటించాలి: సీఐ Wed, May 08, 2024, 01:21 PM
ప్రభుత్వ ఉద్యోగులకి ఈసీ వార్నింగ్ Wed, May 08, 2024, 01:20 PM