రైల్వే జోన్‌ సంగతి ఏమైంది?

by సూర్య | Fri, Apr 26, 2024, 06:10 PM

పియుష్ గోయల్ గురివింద గింజలా మాట్లాడుతున్నారు అని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 2014లో ఏపీలో ఓ దద్దమ్మ ముఖ్యమంత్రిగా(చంద్రబాబును ఉద్దేశిస్తూ..) ఉన్నారు. అప్పుడు కూటమిలో వీరంతా ఉన్నారు. అప్పుడు రైల్వే మంత్రిగా ఉండి పియుష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదు?. రైల్వే జోన్ కోసం 52 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అడ్డంకులు అన్నీ తొలగించి రైల్వే జోన్ కోసం భూములు అప్పగించాం అని మంత్రి బొత్స గుర్తుచేశారు.  2014-19 మధ్య కేంద్రంలో ఉంది సింగిల్‌ ఇంజిన్‌ ప్రభుత్వమా?.. మధ్యలో ఒక ఇంజిన్‌ పని చేసిందా? మరో ఇంజిన్‌ రిపేర్‌ అయ్యిందా? అని మంత్రి బొత్స ఎద్దేశా చేశారు. స్వాతంత్రం వచ్చిన తరువాత ఎలక్టోరల్ బాండ్స్ లో అతి పెద్ద అవినీతి జరిగింది బీజేపీ హయాంలోనే. రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైఎస్సార్‌సీపీ పని చేస్తుంది. మేలు జరిగే ప్రతీ అంశానికి మద్దతు ఇస్తాం. ఏది చేసినా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికగా జరిగే కేటాయింపు. దళితుల రిజర్వేషన్లు తగ్గించాలని చూస్తే బీజేపీ మట్టి కొట్టుకుపోతుంది. మంత్రి పదవుల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడే ప్రతీ మాటకు నిబద్దత ఉండాలి. పియుష్ గోయల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇకపై మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని ఆయన్ని కోరుతున్నా అని మంత్రి బొత్స అన్నారు. 

Latest News

 
కొమ్ముగూడెంలో కూటమి విస్తృత ఎన్నికల ప్రచారం Wed, May 08, 2024, 12:52 PM
17 మెడికల్‌ కాలేజీలు అభివృద్ధి కాదా? Wed, May 08, 2024, 12:01 PM
చంద్ర‌బాబు తక్ష‌ణ‌మే ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాలి Wed, May 08, 2024, 12:00 PM
దళిత మహిళా ఐన నాపైన దాడికి దిగడం దారుణం Wed, May 08, 2024, 11:59 AM
పెత్తందారులతో సమరానికి పేదలు సిద్ధం అయ్యారు Wed, May 08, 2024, 11:57 AM