రైతులకు ఏ ఇబ్బంది లేకుండా సాగునీరు అందించాం

by సూర్య | Thu, Apr 25, 2024, 06:54 PM

గత ఎన్నికలప్పుడు ఏవైతే హామీలిచ్చారో సంక్షేమ పథకాలు చెప్పారో చెప్పినవి చెప్పినట్టుగా గడిచిన ఐదేళ్లలో ఎన్ని ఇబ్బందులున్నా.. కోవిడ్ వల్ల రెండు సంవత్సరాలు కోల్పోయినా చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేసి సీఎం వైయ‌స్ జగన్‌ చూపించారని ఎంపీ వైయ‌స్ అవినాష్ రెడ్డి అన్నారు. సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో భాగంగా పులివెందులోని సీఎస్ఐ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో  ఎంపీ వైయ‌స్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ..... ఐదు  సంవత్సరాల జగనన్న పాలనలో ఈ నియోజకవర్గం అన్నిరకాలుగా అభివృద్ధి చెందింది. మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు టౌన్‌లో జరిగింది మీరంతా చూశారు. సంక్షేమ పథకాలు ఒకవైపు, అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు ముఖ్యంగా సాగునీటి రంగం గురించి ఒకసారి ఆలోచించండి. 2019 నుంచి 2024 వరకు ఈ ఐదేళ్లలో నాలుగుసార్లు సీబీఆర్ను ఫుల్ కెపాసిటీ 10 టీఎంసీలు పెట్టడం జరిగింది. అదేవిధంగా పైడిపాలెం 6 టీఎంసీలు నాలుగుసార్లు నింపడం జరిగింది. మరి అలా నింపాం కాబట్టే ఈ ఐదేళ్లపాటు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా మనం సాగునీరు అందించాం.  మీరు ఒక్కసారి ఆలోచించండి, 16 నెలల క్రితం చంద్రబాబు నాయుడు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరుతో రాయలసీమ ప్రాంతానికి అందులో భాగంగా పులివెందుల కూడా రావడం జరిగింది. ఆయన పులివెందుల వచ్చి వెళ్లాక ఈ 16 నెలల్లో వర్షమే లేదు. చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన తర్వాత వర్షమనేది దూరమైన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మనం ఈ 16 నెలల కరువు కాలంలో కూడా ఎక్కడా ఇబ్బంది పడకుండా మనం లింగాల బ్రాంచ్ కెనాల్ క్రింద చెరువులు కావొచ్చు, పీబీసీ క్రింద చెరువులు కావొచ్చు, జీకేఎల్ఐ క్రింద చెరువులకు కావొచ్చు సమృద్ధిగా అరటి, చీని రైతులకు సమృద్ధిగా మనం నీళ్లు అందించామంటే జగనన్న ముందుచూపుతో సీబీఆర్లో 10 టీఎంసీలు పెట్టడం, పైడిపాలెంలో 6 టీఎంసీలు పెట్టడం వల్లనే సాధ్యమైందనే విషయాన్ని ప్రతి రైతు సోదరుడికి తెలియజేస్తున్నానని అన్నారు.

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM