by సూర్య | Sun, Apr 14, 2024, 03:42 PM
డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ 133వ జయంతి వేడుకలను కొండాపురం మండలం ఎమ్మార్పీఎస్ నాయకులు ఆదివారం కొండాపురం వెలుగు కార్యాలయ సభా భవనంలో ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, అంబేడ్కర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రమేష్, ఓంకార్, నాగ సుబ్బరాయుడు, పెద్దన్న, గంగాధర్, నారాయణ, నాగన్న, కుళాయప్ప, తదితర ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.
Latest News