వైసీపీ గంజాయి మొక్కలను పీకుదాం

by సూర్య | Sat, Apr 13, 2024, 04:39 PM

గుడివాడలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నేత ఒకరు వైసీపీకి గుడ్‌బై చెప్పేశారు. వైసీపీ నాయకుడు షేక్ మౌలాలి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. శనివారం గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము సమక్షంలో మౌలాలి పార్టీలో చేశారు. మౌలాలికి వెనిగండ్ల రాము పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. మౌలాలితో పాటు అతని అనుచురులు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా వెనిగండ్ల రాము మాట్లాడుతూ... ప్రజలకు మంచి చేసేందుకు వైసీపీని వదిలి మౌలాలి లాంటి వ్యక్తులు టీడీపీలోకి వస్తున్నారన్నారు. నాని పచ్చి మోసగాడని.... అవసరం తీరిన తర్వాత వదిలేస్తాడని వైసీపీ నేతలే బహిరంగంగా చెబుతున్నారన్నారు. ప్రజలను మోసగిస్తే ఎమ్మెల్యే ఆడుతున్న డ్రామాలు ఎక్కువ రోజులు సాగవన్నారు. ప్రజలకు అబద్ధాలు చెప్పడంలో జగన్ రెడ్డి మొదటి స్థానంలో ఉంటే, కొడాలి నాని రెండో స్థానంలో ఉన్నారని విమర్శించారు. అభివృద్ధి గురించి పట్టించుకోకుండా, అరాచకానికే ప్రాధాన్యతనిస్తున్న వైసీపీ గంజాయి మొక్కలను పీకడంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యుడు కావాలని పిలుపునిచ్చారు.రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చలేని ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మోసం చేస్తుందని మండిపడ్డారు. గుడివాడలో గంజాయి బ్యాచ్ అరాచకాలు ఎక్కువయ్యాయని.. ఎక్కడా లేని విధంగా గుడివాడలో గంజాయి బ్యాచ్ పేట్రేగిపోతుందని అన్నారు. క్రికెట్ బెట్టింగ్‌లు, పేకాట శిబిరాలు, జూద క్రీడలతో తమ స్వార్థం కోసం గడ్డం గ్యాంగ్ యువతను పెడద్రోవపట్టిస్తున్నారని మండిపడ్డారు. మన గుడివాడ అభివృద్ధి, భావితరాలు బాగుండాలంటే ప్రజలందరూ చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని వెనిగండ్ల రాము కోరారు.

Latest News

 
ఏపీ సీఈఓ కీలక ఆదేశాలు Fri, May 24, 2024, 11:26 AM
సత్యనారాయణ స్వామి ఆలయంలో సామూహిక వ్రతాలు Fri, May 24, 2024, 11:25 AM
జియో ఫిజిక్స్ లో సులోచన రాణికి డాక్టరేట్ Fri, May 24, 2024, 10:31 AM
ఏపీలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు Fri, May 24, 2024, 10:21 AM
వైభవంగా శ్రీ ఆంజనేయ స్వామి రధోత్సవం Fri, May 24, 2024, 10:20 AM